వ్యక్తి చనిపోయిన తర్వాత పాస్‌పోర్ట్‌, ఓటర్‌ ఐడి, పాన్‌ కార్డులు ఏమవుతాయి..?

Person Dies: పాస్‌పోర్ట్, ఓటర్‌ ఐడి, పాన్‌ కార్డు ఒక వ్యక్తి గుర్తింపును తెలుపుతాయి.

Update: 2021-11-29 16:20 GMT

వ్యక్తి చనిపోయిన తర్వాత పాస్‌పోర్ట్‌, ఓటర్‌ ఐడి, పాన్‌ కార్డులు ఏమవుతాయి..? (ఫైల్ ఇమేజ్)

Person Dies: పాస్‌పోర్ట్, ఓటర్‌ ఐడి, పాన్‌ కార్డు ఒక వ్యక్తి గుర్తింపును తెలుపుతాయి. ఇవి లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి. బ్యాంకు లావాదేవీల నుంచి ప్రభుత్వం పథకాల వరకు అన్ని పనులు వీటితో ముడిపడి ఉంటాయి. ఇవి ఎక్కడైనా పొగొట్టుకుంటే చాలా అనర్ధాలు జరుగుతాయి. అలాంటిది ఇవన్నీ పొందిన ఒక వ్యక్తి మరణిస్తే వీటి పరిస్థితి ఏంటి..? అప్పుడు ఇవి వినియోగంలో ఉంటాయా ఒకవేళ వీటి అవసరం లేదనుకుంటే ఏం చేయాలి తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

పాస్‌పోర్ట్

ముందుగా మరణించిన వ్యక్తికి గుర్తింపు కార్డులను కుటుంబ సభ్యులు చాలా భద్రంగా ఉంచాలి. లేదంటే ఎవరైనా వీటితో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్ చాలా ముఖ్యం. ఇది లేకుండా మీరు విదేశాలకు వెళ్లలేరు. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని ఆలోచిస్తుంటే అది సాధ్యం కాదు. నిజానికి ఆధార్ కార్డులాగా పాస్‌పోర్టును రద్దు చేసే పద్దతి ఇంకా చేయలేదు. కానీ పాస్‌పోర్ట్‌కి కాలపరిమితి ఉంటుంది ఆ తర్వాత దానిని పునరుద్ధరించుకోవాలి. అయితే అది పునరుద్ధరించకపోతే అది ఎలాగు పనికిరాదు.

2. ఓటరు గుర్తింపు కార్డు

భారతదేశంలో ప్రతి కార్డుకి ఒక ఉపయోగం ఉంటుంది. అదే విధంగా ఓటర్ ID కార్డ్ కూడా ఒక ముఖ్యమైన పత్రం. భారత పౌరుడిగా ఉండటంతో పాటు మీరు ఈ పత్రం ద్వారా ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. ఎందుకంటే ఇది మీ హక్కు కూడా. ఎవరైనా మరణించిన తర్వాత దానిని రద్దు చేయవచ్చు. ఇందుకోసం ఎన్నికల కార్యాలయానికి వెళ్లి ఫారం-7 నింపాలి. ఆ తర్వాత ఈ కార్డ్ రద్దు చేస్తారు. కానీ దానిని రద్దు చేయడానికి మీకు మరణ ధృవీకరణ పత్రం అవసరం.

3. పాన్ కార్డ్

ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి పాన్ కార్డ్ చాలా ముఖ్యం. అయితే ఎవరైనా మరణించిన తర్వాత దానిని సరెండర్ చేయవచ్చు. అంతకు ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాస్తవానికి మీ ఆదాయపు పన్ను రిటర్న్ ప్రక్రియ పూర్తికాని వరకు మీరు దానిని సురక్షితంగా ఉంచుకోవాలి. ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు ఈ పత్రాన్ని ఆదాయపు పన్ను శాఖకు అందజేయగలరు. మరణించిన వ్యక్తి పాన్ కార్డ్ భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుందని భావిస్తే మీరు దానిని మీ వద్ద ఉంచుకోవచ్చు.

Tags:    

Similar News