Watch Video: వరద బీభత్సం.. నీటమునిగిన మనాలి టోల్‌ప్లాజా.. ఎక్కడో తెలుసా?
ఉత్తర భారతదేశంలో వర్షాలు ఆగకుండా కురుస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వరదల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.

బియాస్ నది ఉప్పొంగి ప్రవహించడంతో మనాలి సమీపంలోని రైసన్ టోల్‌ప్లాజా పూర్తిగా నీటమునిగింది. వరద ఉధృతి కారణంగా టోల్‌ప్లాజా చుట్టుపక్కల రోడ్లు కొట్టుకుపోయాయి. స్థానిక నివాసాలు నీటిలో మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత భవనాలు కూలిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది.
ప్రస్తుతం మనాలి టోల్‌ప్లాజా వరద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొన్నివాహనాలు కూడా నీటిలో ఇరుక్కుపోయిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి.
సోమవారం సాయంత్రం నుండి రాష్ట్రంలో 12 ఆకస్మిక వరదలు, రెండు భారీ కొండచరియలు సంభవించాయి. అదృష్టవశాత్తు, ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.