Viral Video: బిల్ తప్పించేందుకు వెజ్ బిర్యానీలో చికెన్ కలిపిన యువకుల గ్యాంగ్.. సీసీటీవీ ఫుటేజ్‌ తో అసలు రూపం బయటపడి షాక్!

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ శాస్త్రి చౌక్‌లో ఉన్న బిర్యానీ బే రెస్టారెంట్‌లో ఇటీవల ఓ వింత ఘటన చోటుచేసుకుంది. డిన్నర్‌కు వచ్చిన యువకుల గ్యాంగ్, వెజ్ బిర్యానీలో చికెన్ ముక్కలు వచ్చాయంటూ హంగామా సృష్టించింది.

Update: 2025-08-04 16:21 GMT

Viral Video: బిల్ తప్పించేందుకు వెజ్ బిర్యానీలో చికెన్ కలిపిన యువకుల గ్యాంగ్.. సీసీటీవీ ఫుటేజ్‌ తో అసలు రూపం బయటపడి షాక్!

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ శాస్త్రి చౌక్‌లో ఉన్న బిర్యానీ బే రెస్టారెంట్‌లో ఇటీవల ఓ వింత ఘటన చోటుచేసుకుంది. డిన్నర్‌కు వచ్చిన యువకుల గ్యాంగ్, వెజ్ బిర్యానీలో చికెన్ ముక్కలు వచ్చాయంటూ హంగామా సృష్టించింది. మతపరమైన భావోద్వేగాలను ప్రస్తావిస్తూ నానా గగ్గోలు పెట్టింది. అయితే అనంతరం బయటపడ్డ సీసీటీవీ ఫుటేజ్‌ మాత్రం షాకింగ్‌ టర్న్ ఇచ్చింది.

జూలై 31 రాత్రి, సుమారు 12–13 మంది యువకులతో కూడిన గ్యాంగ్ రెస్టారెంట్‌లో భోజనం చేయడానికి వచ్చింది. వారిలో కొంతమంది వెజ్ ఆర్డర్ చేయగా, మరికొందరు నాన్ వెజ్ ఆర్డర్ చేశారు. భోజనం జరుగుతున్న సమయంలో గ్యాంగ్‌లోని ఒక యువకుడు అకస్మాత్తుగా "వెజ్‌లో చికెన్ ఉంది!" అంటూ అరవడం ప్రారంభించాడు. దీంతో అక్కడ ఉన్న ఇతర కస్టమర్లు గందరగోళానికి గురయ్యారు.

రెస్టారెంట్ యజమాని రవికర్ సింగ్ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించినా, వారు వినిపించుకోలేదు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి విషయాన్ని ఆరా తీశారు.

సీసీటీవీ ఫుటేజ్‌ లో అసలేం జరిగిందంటే?

రెస్టారెంట్ యజమాని విడుదల చేసిన సీసీటీవీ వీడియో ప్రకారం, ఆ యువకులు ముందుగానే ఒక చికెన్ ముక్కను తమ వెజ్ బిర్యానీలో ఉద్దేశపూర్వకంగా వేసినట్లు స్పష్టమైంది. దీనివల్ల రెస్టారెంట్‌పై విమర్శలు వెల్లువెత్తేలా చేసి, బిల్‌ మాఫీ పొందాలనే ఆలోచనతోనే ఈ నాటకం ఆడినట్టు బయటపడింది.

యజమాని మాట్లాడుతూ, “మేము ఎన్నో ఏళ్లుగా మతపరమైన భావాల పట్ల గౌరవంతో పని చేస్తున్నాం. ఈ తప్పుడు ఆరోపణలు మా ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్ర భాగమే,” అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులు వద్ద ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది.



Tags:    

Similar News