Viral Video: ఆటో నడిపితేనేం.. ఆమె ఆత్మవిశ్వాసం అమోఘం… నెట్టింట్లో కితాబుల వర్షం
బెంగళూరులోని రద్దీ వీధుల్లో ఓ యువతి ఆటో నడిపుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె పేరు సఫురా. ఉల్లాసమైన స్వభావం, దృఢ సంకల్పంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఆమె వీడియో నెట్టింట్లో సంచలనం సృష్టించి లక్షలాది మందిని ఆకట్టుకుంది.

ఒక రోజు తమన్నా తన్వీర్ అనే మహిళ ఓ క్యాబ్ బుక్ చేసుకోవాలని చూసింది. అయితే ఆ సమయంలో ఆమెకు ఆటో డ్రైవర్‌గా సఫురా రావడంతో ఆశ్చర్యపోయింది. ఆసక్తిగా ఆమెతో మాట్లాడి వీడియో తీశింది. ఆ వీడియోనే ఇప్పుడు అందరూ షేర్ చేస్తున్నారు.
వీడియోలో సఫురా మాట్లాడుతూ – "డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ కారు కొనడానికి బడ్జెట్ లేకపోవడంతో ఆటో కొన్నాను. ముందుగా ఆటోతో ప్రారంభిస్తాను, తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం" అని చెప్పింది. ఈ మాటలు నెట్టింట్లో వేలాది మందికి స్ఫూర్తినిచ్చాయి.
సఫురా తన అభిరుచిని వృత్తిగా మార్చుకోవడంతో పని మీద ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటానని చెబుతోంది. "పని చేయడానికి వెళ్ళాలన్న ఆలోచనతో నాకు సోమరితనం రాదు. ప్రతిరోజూ ఆనందంగా, పూర్తి శక్తితో పని చేస్తాను" అని ఆమె చెప్పింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు సఫురాకు సెల్యూట్ చేస్తున్నారు. "స్టీరియోటైప్‌ను బద్దలు కొట్టినందుకు హ్యాట్సాఫ్", "మీ చిరునవ్వు చాలా పాజిటివ్ వైబ్ ఇస్తోంది, మీ కలలు నెరవేరాలని కోరుకుంటున్నాం" అంటూ కామెంట్లు చేస్తున్నారు.