Viral Video: నదిలో ఆనందంగా నడుస్తూ..అహ్లాదంగా పాటలు పాడిన జంట ఏనుగులు.. సోషల్ మీడియాలో వైరల్
Viral Video: థాయిలాండ్‌లోని ఒక నదిలో రెండు ఏనుగులు సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ ఈదుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
Viral Video: నదిలో ఆనందంగా నడుస్తూ..అహ్లాదంగా పాటలు పాడిన జంట ఏనుగులు.. సోషల్ మీడియాలో వైరల్
Viral Video: థాయిలాండ్‌లోని ఒక నదిలో రెండు ఏనుగులు సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ ఈదుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ జంట ఏనుగులు నదిలో నడుచుకుంటూ వింత వింత శబ్ధాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ వీడియోని చూసిన తర్వాత ‘వాటికవి ఆనందకరమైన శబ్దాలే కానీ ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ శబ్దాలు అంటూ ఆనందంతో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
ముందు ఒక మగ ఏనుగు, వెనకాల ఒక ఆడ ఏనుగు రెండు ఒకదాని తర్వాత ఒకటి నదులో ఈదు కుంటూ ముందుకు వెళుతున్నాయి. అంతేనా.. ఈ రెండు ఏనుగులు ఆ నీళ్లలో ఈదడాన్ని వింత వింత శబ్ధాలు చేసుకుంటూ మరీ ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ రెండు ఏనుగులు నదిలో ఈదుతూ ఆడుకుంటున్న హృదయాన్ని కదిలించే వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
నిజంగా నెటిజన్లకు ఈ వీడియో నచ్చింది ఏంటంటే.. ఏనుగులు చాలా ఉల్లాసంగా.. ఉత్సాహంగా నదిలో ఈదడం మాత్రమే కాదు.. అవి చేసే ఆనందకరమైన ట్రంపెట్ లాంటి శబ్దాలకు ఫిదా అయిపోతున్నారు. థాయిలాండ్ సేవ్ ఎలిఫెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు లెక్ చైలెర్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోని పోస్ట్ చేశాడు. జంతువులు చాలా నేచురల్‌గా ఇలా హాయిగా తిరగడాన్ని రికార్డ్ చేయడంపై ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ వీడియో ప్లే అవగానే..‘వాల్యూమ్‌ను ఆన్ చేయండి మరియు మీరు ఏనుగు యొక్క సంతోషకరమైన పాటను వింటారు" అని వీడియోతో పాటు ఒక మెసేజ్ కూడా ఉంటుంది. వేగంగా ప్రవహించే నది మధ్యలో ఈ రెండు ఏనుగులు చెవులు ఊపుతూ ఒక అహ్లాదకరమైన సంగీతంలా శబ్ధాలు చేసుకుంటూ ఎంతో ఆనందంగా నదిలో ఈదుతుంటాయి. కొంచెం దూరం వెళ్లిన తర్వాత మగ ఏనుగు ఆగి వెనకాల ఆడ ఏనుగునే తదేకంగా చూస్తూ నిలబడి పోతుంది. అప్పుడు పక్కగా వచ్చిన ఆడ ఏనుగు కూడా మగ ఏనుగును అలానే తదేకంగా చూస్తుంది. నిజమైన ప్రేమకు మాటలు అవసరం లేదు. స్పర్శ అవసరం లేదు.. నాలుగు కళ్లు కలిస్తే చాలనే విధంగా ఆ సన్నివేశం ఉంటుంది. అందుకే ఈ ఏనుగుల వీడియో నెటిజన్ల హృదయాల్ని కదిలించివేసింది.