Viral Video: ఈ మైసూర్ ఆటోలో ఏముందే చూస్తే అందరికీ షాక్..
Viral Video: ఇటీవల మైసూర్‌లోని ఒక మహిళ ఊబర్ ఆటో ఎక్కగానే షాక్ తింది. ఆటో లోపల ఆటో డ్రైవర్ ఏర్పాటు చేసిన మినీ లైబ్రరీని చూసి ఆశ్చర్యపోయింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ఒప్పుడు సోషల్ మీడయాలో తెగ వైరల్ అవుతుంది.
Viral Video: ఈ మైసూర్ ఆటోలో ఏముందే చూస్తే అందరికీ షాక్..
viral video: ఇటీవల మైసూర్‌లోని ఒక మహిళ ఊబర్ ఆటో ఎక్కగానే షాక్ తింది. ఆటో లోపల ఆటో డ్రైవర్ ఏర్పాటు చేసిన మినీ లైబ్రరీని చూసి ఆశ్చర్యపోయింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ఒప్పుడు సోషల్ మీడయాలో తెగ వైరల్ అవుతుంది. వివారాల్లోకి వెళితే..
మైసూర్ నగరంలో ఇటీవల ఒక మహిళ ఊబర్ ఆటోని బుక్ చేసుకుంది. ఆ తర్వాత ఆ ఆటో ఎక్కగానే ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఎదురగా చిన్నపాటి లైబ్రరీ. అందులో మంచి మంచి పుస్తకాలు. ఆమె వాటిని ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు కూడా చాలా టచింగ్ రిప్లైలు ఇస్తున్నారు.
ఆటో ఎక్కంగానే ఆ మహిళ ఒకింత ఆశ్చర్యం ఒకింత ఆనందంతో ఉప్పొంగిపోయింది. సాధారణంగా ఏదైనా ఆటో ఎక్కితే ఏవో సినిమా హీరోహీరోయిన్ల పోస్టర్లు లేదా దేవుళ్ల పోస్టర్లు కనిపిస్తాయి. అటువంటి ఈ వ్యక్తికి చెందిన ఆటోలో అటువంటివేవీ కనిపించకపోగా.. ఒక మినీ లైబ్రరీయే కనిపించింది. ఇందులో చాల రకాల పర్సనాలిటీ డవల్మెంట్ పుస్తకాలు కూడా ఉన్నాయి.
ఈ పుస్తకాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ, ఇవి ఆటోలో ఉన్నాయని చెబుతూ ఆ మహిళ తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వృత్తి రీత్యా కళాకారిణి అయిన లిసియా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోని షేర్ చేసింది. దీనికి ప్రస్తుతం మిలియన్లకు పైగా వ్యూస్ వచ్యాయి. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆటో లోపల చక్కగా అమర్చబడిన వివిధ రకాల పుస్తకాలు, ఆలోచనాత్మక కోట్స్ ఉండడాన్ని వీడియోలు గమనించవచ్చు.
“నా ఉబెర్ రైడ్‌లో నేను ఏమి కనిపెట్టానో..చూడండి. ఎంత అద్భుతమైన ఆలోచన కదా అంటూ ఆటోలో ఉన్న పుస్తకాలను చూపిస్తూ ఒక మహిళ వీడియో చేసింది. ప్రయాణీకుడు కాంపాక్ట్ లైబ్రరీ నుండి పుస్తకాలను బ్రౌజ్ చేస్తున్నప్పుడు, అది తన రోజువారీ ప్రయాణాన్ని చిరస్మరణీయమైనదిగా మార్చింది.