Viral Video: డీజిల్ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టేస్తారా?.. ఒక్క చిన్న నిప్పురవ్వ పడినా పెద్ద విపత్తే!
ఫ్రీలో దొరికితే ఫినాయిల్ కూడా వదిలిపెట్టని మనవాళ్లు.. మద్యం లోడ్ లారీ బోల్తా పడితే గాయపడిన వారిని పట్టించుకోకుండా మద్యం సీసాలు ఎత్తుకుపోతారు. ఇప్పుడు అదే సీన్ డీజిల్‌తో రిపీట్ అయింది.
Viral Video: డీజిల్ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టేస్తారా?.. ఒక్క చిన్న నిప్పురవ్వ పడినా పెద్ద విపత్తే!
ఫ్రీలో దొరికితే ఫినాయిల్ కూడా వదిలిపెట్టని మనవాళ్లు.. మద్యం లోడ్ లారీ బోల్తా పడితే గాయపడిన వారిని పట్టించుకోకుండా మద్యం సీసాలు ఎత్తుకుపోతారు. ఇప్పుడు అదే సీన్ డీజిల్‌తో రిపీట్ అయింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా లేదా అన్నది చూసే పనీ చేయకుండా.. బకెట్లు, క్యాన్లతో పరుగెత్తుకొచ్చి డీజిల్ నింపుకుని వెళ్లిపోయారు.
ఈ ప్రమాదంలో 20 వేల లీటర్లకుపైగా డీజిల్ రోడ్డుపై కారింది. ఆ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని డీజిల్ కోసం పోటీ పడ్డారు. ఎవరికైనా సహాయం చేయాలనే ఆలోచన ఒక్కరికీ రాకుండా.. లీటర్ల కొద్దీ డీజిల్ నింపుకోవడమే వారి టార్గెట్.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. "మీ కక్కుర్తి పాడుగాను.. ప్రాణాల రిస్క్ ఎందుకు బ్రో? చిన్న నిప్పురవ్వ పడినా అంతా బూడిదవుతారు" అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కొన్ని రూపాయల డీజిల్ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కూడా ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.