Viral Video: తమ కేర్ టేకర్‌ని ఏనుగులు ఎలా రక్షించుకుంటున్నాయో చూడండి.. వైరల్ వీడియో
Viral Video: ఏనుగుల సున్నితమైన, రక్షణకల్పించే మనస్తత్వానికి ఈ వీడియో నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో అందరి హృదయాలను కదిలిస్తోంది.
Viral Video: తమ కేర్ టేకర్‌ని ఏనుగులు ఎలా రక్షించుకుంటున్నాయో చూడండి.. వైరల్ వీడియో
Viral Video: ఏనుగుల సున్నితమైన, రక్షణకల్పించే మనస్తత్వానికి ఈ వీడియో నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో అందరి హృదయాలను కదిలిస్తోంది. ఎలిఫెంట్ నేచర్ పార్క్ ఈ వీడియోని షేర్ చేసింది. ఒక కేర్ టేకర్ ఒక నది దగ్గర కూర్చుని, నీళ్లలో ముఖాన్ని కడుగుతున్న సమయంలో ఏనుగులు అన్నీ కేర్ టేకర్‌కు రక్షణ కవచంలా నిలబడ్డాయి. మళ్లీ ఆమెకు ఏదో సాయం చేసేసినట్లు తెగ హడావిడి చేస్తున్నాయి. ఆ వీడియోలో ఇంకా ఏముందో తెలుసుకుందాం.
జంతువులకు తమ వారిపై ఉండే నమ్మకానికి ఈ వీడియో నిదర్శనం. నది అంచున ప్రశాంతంగా నిలబడి ఉన్న అనేక ఏనుగులతో, వాటి మధ్యలో చైలెర్ట్ కూర్చుని ఉండటంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. ఈ వీడియోని చాలా ప్రశాంతంగా మరియు లోతుగా చూడాలి. అప్పుడే అందులో ఉండే ఫీల్ అర్ధం అవుతుంది. ఆమెకిందన కూర్చుని ఉంటే చుట్టూ ఏనుగులు గుమిగూడి ఉంటాయి. అవన్నీ ఇంకా ఎలా ఉంటాయంటే ఆమెకు ఒక రక్షణ కవచంలా ఉంటాయి. అంతేకాదు ఆమె అక్కడున్న నీళ్లతో తన ముఖాన్ని కడుకుంటున్నప్పుడు ఒక ఏనుగు ఆమెకు సహకరించడం కూడా ఈ వీడియోలో మనం చూడొచ్చు.
సోషల్ మీడియాలో ఈ వీడీయో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోకి "పెద్దలు లేదా చిన్నవాళ్లు ఎవరైనా సరే.. వారంతా రక్షణగా ఉంటారనే ట్యాగ్ ఉంది. ఈ ఏనుగులు ఎప్పుడూ అంటిపెట్టుకునే తిరుగుతుంటాయి. ఆమెను విడిచి పెట్టి అసలు ఉండవు. ఇదిగో ఈ వీడియోలో చూశారు కదా. ఆమెను ఆ ఏనుగులు అసలు విడిచిపెట్టి ఉండటం లేదు.
ఇంటర్నెట్ స్పందన
ఈవీడియోను ఎప్పుడైతే అప్‌లోడ్ చేశారు అప్పుడు వెంటనే దాదాపు 29 వేలమంది చూశారు. అందరూ కూడా ఈ వీడియోని చూశి భాగ్వోద్వేగానికి గురయ్యరు. ఈ వీడియో తమ ఆత్మను టచ్ చేశాయంటూ చాలామంది నెటిజన్లు పోస్ట్ పెట్టారు. మరొకరైతే.. ఇంత పెద్ద భారీ శరీరంతో ఉన్నా కూడా అవి తన కేర్ టేకర్‌ని చూడండి ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాయో అని కామెంట్ చేశారు. ఇంకొకరు.. ఆమె ఒక హీరో అంటూ కామెంట్ చేశారు.