Viral Video: బాబోయ్..స్ట్రాబెర్రీ జ్యూస్‌తో గుడ్డు ఫ్రై..ఈ వింత వంటకం చూస్తే వాంతులు ఖాయం

Viral Video: ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి ఒక వీధి వ్యాపారి దగ్గరకు వెళ్లి, తన చేతిలో ఉన్న స్ట్రాబెర్రీ జ్యూస్ బాటిల్ ఇచ్చి దాంతో ఆమ్లెట్ వేయమని అడుగుతాడు.

Update: 2026-01-23 07:08 GMT

Viral Video: బాబోయ్..స్ట్రాబెర్రీ జ్యూస్‌తో గుడ్డు ఫ్రై..ఈ వింత వంటకం చూస్తే వాంతులు ఖాయం 

Viral Video: ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి ఒక వీధి వ్యాపారి దగ్గరకు వెళ్లి, తన చేతిలో ఉన్న స్ట్రాబెర్రీ జ్యూస్ బాటిల్ ఇచ్చి దాంతో ఆమ్లెట్ వేయమని అడుగుతాడు. ఆ వ్యాపారి కూడా ఏమాత్రం ఆలోచించకుండా పని మొదలుపెట్టాడు. మామూలుగా ఆమ్లెట్ వేయాలంటే పెనం మీద నూనె లేదా వెన్న వేస్తారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. పెనం మీద ముందుగా స్ట్రాబెర్రీ జ్యూస్ పోశారు. ఆ జ్యూస్ మరుగుతుండగా అందులో ఒక్కొక్కటిగా ఏకంగా ఐదు గుడ్లు కొట్టి పోశారు. ఆ తర్వాత అందులో కొన్ని టమాటా ముక్కలు, మరికొన్ని సాస్‌లు కలిపి వింతగా ఆ మిశ్రమాన్ని ఫ్రై చేశారు. చివరికి ఆ ఎర్రటి స్ట్రాబెర్రీ ఆమ్లెట్‎ను ప్లేటులో పెట్టి ఆ కస్టమర్‌కు సర్వ్ చేశారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి దాన్ని ఎంతో ఇష్టంగా తింటూ కెమెరాకు ఫోజులు ఇచ్చాడు. ఈ వింత ప్రయోగాన్ని చూసిన నెటిజన్లు మాత్రం తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. "ఇది చూస్తుంటేనే నాకు కడుపులో తిప్పేస్తోంది" అని ఒకరు కామెంట్ చేయగా, "ఆమ్లెట్ తినాలన్న ఆశ కూడా పోగొట్టేశారు, దీన్ని నేను అస్సలు క్షమించలేను" అని మరొకరు మండిపడ్డారు. తిన్నవాడికి లేని నొప్పి మనకెందుకు అని కొందరు సర్దిచెప్పుకుంటున్నా, ఎక్కువమంది మాత్రం ఫుడ్ విషయంలో ఇలాంటి ప్రయోగాలు చేయడం నేరమని అభిప్రాయపడుతున్నారు.

ఈ వీడియోకు వచ్చిన ఆదరణ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. 'travelicious_88' అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడి నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు 5.5 కోట్ల మందికి పైగా వీక్షించారు. అంటే దాదాపు ఐదున్నర కోట్ల వ్యూస్ వచ్చాయన్నమాట. దాదాపు 8 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం జనం ఎంతటి వింత పనులకైనా తెగిస్తున్నారని ఈ వీడియో మరోసారి నిరూపించింది. గతంలో కూడా కోకాకోలాలో చికెన్ వండటం, ఓరియో బిస్కెట్లతో భోజనం చేయడం వంటి వీడియోలు వైరల్ అయ్యాయి, కానీ ఈ స్ట్రాబెర్రీ ఆమ్లెట్ మాత్రం అన్నిటినీ మించిపోయింది.



ఆహార నిపుణులు మాత్రం ఇలాంటి వింత కాంబినేషన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పండ్లు లేదా పండ్ల రసాలను వేడి చేసినప్పుడు వాటిలోని పోషకాలు దెబ్బతినడమే కాకుండా, కొన్నిసార్లు అవి ఇతర పదార్థాలతో కలిసినప్పుడు కడుపులో ఇన్ఫెక్షన్లు లేదా అలెర్జీలకు దారితీయవచ్చు. ఏది ఏమైనా, ఇలాంటి వింత రుచులు కేవలం వీడియోలకే పరిమితమైతే బాగుంటుందని నెటిజన్లు కోరుకుంటున్నారు. లేదంటే రేపు పొద్దున హోటళ్లలో కూడా ఇలాంటివే ఆర్డర్ చేయాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు.

Tags:    

Similar News