Viral video: బ్లాక్ బ్లస్టర్ చిత్రాన్ని తలపించేలా చిరుత, పులి ఫైటింగ్.. నిజంగా ఆ ఫైటింగ్ చూడాల్సిందే..

Viral Video: సింహం ఎక్కడైనా రాజే. ఎందుకంటే దాని పంజా విసిరిందే ఏ జంతువైనా.. ఎంత బలమైనదైనా లొంగాల్సిందే. అయితే ఇక్కడ సింహతో ధీటుగా ఓ చిరుత ఫైటింగ్ చేసింది. కొన్ని సెంకడ్ల పాటు జరిగిన ఈ యుద్ధంలో ఎవరు నెగ్గారో తెలియాలంటే.

Update: 2025-07-21 13:51 GMT

Viral video: బ్లాక్ బ్లస్టర్ చిత్రాన్ని తలపించేలా చిరుత, పులి ఫైటింగ్.. నిజంగా ఆ ఫైటింగ్ చూడాల్సిందే..

Viral video: సింహం ఎక్కడైనా రాజే. ఎందుకంటే దాని పంజా విసిరిందే ఏ జంతువైనా.. ఎంత బలమైనదైనా లొంగాల్సిందే. అయితే ఇక్కడ సింహతో ధీటుగా ఓ చిరుత ఫైటింగ్ చేసింది. కొన్ని సెంకడ్ల పాటు జరిగిన ఈ యుద్ధంలో ఎవరు నెగ్గారో తెలియాలంటే..

ఎక్కడైనా రెండు జంతువులు యుద్ధం చేసుకుంటున్నాయంటే చాలామంది చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తారు. ఈ రెండింటిలో ఎవరు నెగ్గుతారా అని ఆసక్తితో ఉంటారు. ఇక్కడ ఓ చిరుత, ఓ సింహం మధ్య యుద్ధం కూడా అలాగే జరిగింది. ఈ రెండు కొన్ని సెకన్ల పాటే ఫైటింగ్ చేసుకున్నాయి. కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోని ప్రపంచంలోని నెటిజన్లంతా తెగ ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో చూద్దాం.

దానికే తెలియకుండా సింహ దగ్గరవరకు ఓ చిరుత వెళ్లిపోయింది. తీరా చూసే లోపే సింహ చిరుతపై ఎటాక్‌కు దిగింది. రెండు, మూడు సెకన్లలో వీటి మధ్య పోరాటం తీవ్రం అయిపోయింది. వేగంలో చిరుత, బలంలో సింహం. రెండూ తెలివైనవే. కానీ సింహం బలం ముందు చిరుత ఎందుకు పనికిరాదు. ఎందుకంటే అది చాలా సన్నగా ఉంది. సింహం బలంగా ఉంది. కానీ విచిత్రం ఏంటంటే.. చిరుత సింహంతో పాటుగా పోరాడింది. చిరుత నేలపైన పడిపోయినప్పటికి తేలికైన శరీరాన్ని ఉపయోగించుకుని సింహంపై ఎదురుదాడికి దిగింది.

సింహం చాలా సింపుల్‌గా ఫైట్ చేస్తే.. చిరుత బీభత్సంగా పోరాడింది. సింహానికి అవకాశం ఇవ్వకుండా తన కోరలు, కత్తిలాంటి గోళ్లతో సింహంపై దూకింది. వేగం వెర్సస్ బలంగా ఈ ఫైటింగ్ 14 సెకన్ల పాటు సాగింది. ఆ తర్వాత నెమ్మదిగా సింహం నుంచి తప్పించుకుని చిరుత అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్దరిలో ఎవరు గెలిచారో చూడండి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.



Tags:    

Similar News