Viral Video: కుందేలును సజీవంగా మింగేసిన సీగల్.. నెటిజన్లు షాక్
సాధారణంగా సముద్ర పక్షులు చేపలు, కీటకాలు, చిన్న పీతలు, నత్తలు వంటి వాటినే ఆహారంగా తీసుకుంటాయి. కొన్నిసార్లు చిన్న పక్షులను, వాటి గుడ్లను కూడా వేటాడతాయి. అయితే ఒక పక్షి బతికే ఉన్న కుందేలును మింగేస్తుందని ఎవరైనా ఊహించారా? తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కొన్ని సెకన్ల ఈ వీడియోలో ఒక సీగల్ కుందేలును దాని బొరియ దగ్గర నుంచి బయటకు లాగి, క్రమంగా సజీవంగానే మింగేయడం స్పష్టంగా కనిపిస్తోంది. మొదట తలను పట్టుకుని, తరువాత నోటి లోపలికి నెమ్మదిగా తోసుకుంటూ మొత్తం మింగేసింది. ఈ దృశ్యం చూసిన నెటిజన్లు తమ కళ్లను నమ్మలేకపోతున్నారు.
ఇప్పటి వరకు సీగల్స్ ఇంత పెద్ద జంతువును, ముఖ్యంగా బతికే ఉన్న కుందేలును మింగిన సంఘటన ఎప్పుడూ వినలేదు. అందుకే ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొందరు నెటిజన్లు, "పక్షి చాలా ఆకలితో ఉండి ఉండొచ్చు.. అందుకే అంత పెద్ద ఎరను కూడా సులభంగా మింగేసింది" అని కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియోను @detailedexplanation అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. అక్కడి యూజర్ మాట్లాడుతూ, సీగల్స్ చాలా అవకాశవాద వేటగాళ్లు, వాతావరణానికి తగ్గట్టు ఏ ఆహారమైనా తింటాయి. తీర ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఎక్కడైనా జీవించే సామర్థ్యం వీటికి ఉంది అని చెప్పాడు.
వీడియో చూసిన తర్వాత ఒక యూజర్, “ఓ భాయ్! ఇది మొత్తం కుందేలును మింగేసింది” అని, మరొకరు “ఇప్పుడు దీన్ని ఎలా జీర్ణించుకుంటుందో అనుకుంటున్నా” అని రాశారు. ఏదేమైనా ఇది చూసిన ప్రతి ఒక్కరికి భయానకంగానే అనిపిస్తోంది.