Viral Video : వామ్మో.. ఇదేం స్టంట్ రా బాబోయ్..చీర కట్టుకుని స్పోర్ట్స్ బైక్ పై దీదీ దండయాత్ర
Viral Video : సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేల సంఖ్యలో వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. కానీ కొన్ని వీడియోలు మాత్రం చూసేవారికి మతిపోగొడతాయి.
Viral Video : వామ్మో.. ఇదేం స్టంట్ రా బాబోయ్..చీర కట్టుకుని స్పోర్ట్స్ బైక్ పై దీదీ దండయాత్ర
Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేల సంఖ్యలో వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. కానీ కొన్ని వీడియోలు మాత్రం చూసేవారికి మతిపోగొడతాయి. సాధారణంగా చీర కట్టుకుని బైక్ నడపడమే కష్టమని చాలామంది భావిస్తారు. అలాంటిది ఒక మహిళ చీర కట్టుకుని ఏకంగా స్పోర్ట్స్ బైక్ మీద ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
చీర కట్టుకుని స్పోర్ట్స్ బైక్ నడపడం ఒక ఎత్తు అయితే, దానిపై విన్యాసాలు చేయడం మరో ఎత్తు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ చీర కట్టుకుని, ముఖానికి మాస్క్ ధరించి బుల్లెట్ వేగంతో వెళ్తున్న బైక్ మీద విన్యాసాలు చేస్తూ కనిపించింది. ముందుగా ఒక చేత్తో బైక్ నడుపుతూ కనిపించిన ఆమె, ఆ తర్వాత రెండు చేతులు వదిలేసి అద్భుతమైన బ్యాలెన్స్‌తో బైక్ డ్రైవ్ చేసింది. అంతటితో ఆగకుండా, బైక్ స్పీడుగా వెళ్తున్న సమయంలోనే వెనక్కి తిరిగి చూడటం అందరినీ భయాందోళనకు గురిచేసింది. ఆమె బ్యాలెన్స్ కొంచెం తప్పినా ప్రాణాపాయం ఉండేది, కానీ ఆమె ఎక్కడా తడబడకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ స్టంట్లను పూర్తి చేసింది.
ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో @aalianadim అనే ఐడి నుండి షేర్ చేశారు. దీనికి "చీరలో బైక్ నడపడం సాధ్యం కాదన్న మాటలు విని నేను నవ్వుకున్నాను.. ఎందుకంటే ధైర్యానికి డ్రెస్ కోడ్‌తో సంబంధం లేదు" అనే క్యాప్షన్ ఇచ్చారు. కేవలం 15 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోకు ఇప్పటివరకు 73 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది ఈ వీడియోను లైక్ చేస్తూ ఆమె సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "మనిషి తలచుకుంటే ఏదైనా సాధించగలరని ఈ దీదీ నిరూపించింది" అని ఒకరు కామెంట్ చేయగా, "ధైర్యం అనేది ధరించే బట్టల మీద ఆధారపడి ఉండదని ఆమె నిరూపించింది" అని మరొకరు రాసుకొచ్చారు. "జీన్స్ వేసినా, చీర కట్టినా.. చేసే పనిపై పట్టు ఉంటే ఏదైనా సాధ్యమే" అంటూ ఆమె టాలెంట్‌ను నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారు. అయితే కొందరు మాత్రం హెల్మెట్ లేకుండా ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు చేయడం ప్రాణాలకు ముప్పు అని కూడా హెచ్చరిస్తున్నారు.