Viral Video : ముసుగులో మాస్ డ్యాన్స్..అత్తమ్మ ముందు అదరగొట్టిన కోడలు

సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ తాజాగా ఒక సంప్రదాయ కోడలు చేసిన డ్యాన్స్ మాత్రం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

Update: 2025-12-30 05:45 GMT

Viral Video : ముసుగులో మాస్ డ్యాన్స్..అత్తమ్మ ముందు అదరగొట్టిన కోడలు

Viral Video : సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ తాజాగా ఒక సంప్రదాయ కోడలు చేసిన డ్యాన్స్ మాత్రం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. పచ్చ రంగు చీర, తల నిండా ముసుగు వేసుకుని.. చూడటానికి పల్లెటూరి పద్ధతైన కోడలిలా కనిపిస్తున్న ఆమె, ఒక్కసారిగా మ్యూజిక్ ప్లే అవ్వగానే ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా మారిపోయింది. ఆమె వేసిన స్టెప్పులు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో అత్తగారు బెడ్‌పై కూర్చుని ప్రశాంతంగా టీ తాగుతుంటే, ఆమె ముందే కోడలు నిత్యా కాంబ్లే రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. ఇంటర్నేషనల్ పాప్ ట్రాక్ Gabriela పాటకు ఆమె వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. సాధారణంగా చీర కట్టుకుని, అది కూడా ముసుగు వేసుకుని డ్యాన్స్ చేయడం చాలా కష్టం. కానీ నిత్య మాత్రం ఎంతో ఈజీగా, గ్రేస్‌ఫుల్‌గా బాడీని విల్లులా తిప్పుతూ వేసిన మూమెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ఈ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు దాదాపు 64 లక్షల మంది ఈ వీడియోను వీక్షించగా, 5 లక్షల మందికి పైగా లైక్ చేశారు. కోడలి టాలెంట్‌తో పాటు, ఆమె డ్యాన్స్‌ను ఎంజాయ్ చేస్తున్న అత్తగారిని చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు. "ఇంత సపోర్టివ్ అత్తమ్మ అందరికీ దొరకాలి" అని కొందరు కామెంట్స్ చేస్తుంటే ముసుగులో ఇంత కిల్లర్ మూమెంట్స్ ఎలా సాధ్యం? అని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


నిత్యా కాంబ్లే ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మంచి డ్యాన్సర్. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (@nityakamble_03) ద్వారా తరచుగా పల్లెటూరి వాతావరణంలో, చీర కట్టుతో ట్రెండింగ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ వీడియోలు షేర్ చేస్తుంటారు. సంప్రదాయాన్ని, మోడ్రన్ డ్యాన్స్ స్టైల్‌ను కలపడం ఈమె స్పెషాలిటీ. అందుకే ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతోంది.

Tags:    

Similar News