Viral video: వికృతానందం అంటే ఇదే..ఆటోలో పిల్లాడ్ని కుక్క కొరుకుతున్నా.. నవ్వుతూ చూస్తున్న వ్యక్తి

Viral Video: కొంతమంది ఎందుకంత వికృతానందం పొందుతారో గానీ.. ఎదుట వాళ్లని ఏడిపించి, భయపెట్టి తెగ ఆనందం పొందుతుంటారు.

Update: 2025-07-21 10:09 GMT

Viral video: వికృతానందం అంటే ఇదే..ఆటోలో పిల్లాడ్ని కుక్క కొరుకుతున్నా.. నవ్వుతూ చూస్తున్న వ్యక్తి

Viral video: కొంతమంది ఎందుకంత వికృతానందం పొందుతారో గానీ.. ఎదుట వాళ్లని ఏడిపించి, భయపెట్టి తెగ ఆనందం పొందుతుంటారు. ఇలాంటిదే తాజాగా ముంబయిలో జరిగింది. ఒక పిల్లాడు ఆటోలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి కుక్కను ఆటోలో వదులుతాడు. భయంతో ఆ పిల్లాడు కేకలు వేస్తున్నా, కుక్క ఆ పిల్లాడి బట్టలు చింపి, కొరుకుతున్నా ఆ వ్యక్తి ఆపకపోగా..నవ్వుతూ చూస్తాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ కుక్క యజమానిని నెటిజన్లు తెగ తిడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

ఆటోలో కూర్చుని ఆడకుందామని కొంతమంది పిల్లలు ఆటో ఎక్కుతారు. కొంచెం దూరంలో ఉన్న కుక్కను చూసి పిల్లలంతా పిట్ బుల్ అని అరుస్తారు. అయితే ఇలా కుక్కను పిల్లలు పిలవడంతో ఆ కుక్క యజమాని సోహెల్ ఖాన్ ఆ కుక్కను తీసుకొచ్చి ఆటోలో వదులుతాడు. అయితే ఆ కుక్క ఆటో ఎక్కగానే కొంతమంది పిల్లలు పారిపోతారు. కానీ హంజా అనే పిల్లాడు మాత్రం తప్పించుకోలేకపోతాడు. ఆటో వెనకాల ఒక కార్నర్‌‌లో ఉండిపోతాడు.. అప్పుడు ఏం జరిగింది అంటే..

11 ఏళ్ల హంజా సకాలంలో తప్పించుకోకపోవడంతో ఆ కుక్కకు దొరికిపోతాడు. ఇదే అదునుగా చూసి ఆ వ్యక్తి ఆ పిల్లాడిపై కుక్కను వదులుతాడు. అతను పక్కనే కూర్చుని నవ్వుతూ ఉంటాడు. ఆ పిల్లాడు భయంతో కేకలు పెడుతుంటాడు. తీయమని బతిమాలుతుంటాడు. కానీ ఆ యజమాని అదేమీ వినకపోగా.. నవ్వుతూ అలా చూస్తుంటాడు.

ఈ మొత్తం సంఘటన వీడియోలో రికార్డైంది. రికార్డ్ చేస్తున్న వాళ్లు, అక్కడున్న వాళ్లు సైతం ఈ సంఘటనను చూస్తున్నారే గానీ ఎవరూ ఆపలేదు. పైగా పగలబడి నవ్వుతున్నారు. ఆ తర్వాత సోహెల్.. మొదట బాలుడు హంజాను కుక్కతో భయపెట్టి, ఆపై దానిని అతనిపైకి విసిరాడు. తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో, హంజా ఆటో నుండి దూకి పారిపోయాడు, కానీ పిట్ బుల్ అతన్ని వెంబడించి అనేక చోట్ల కరిచింది.

అక్కడ చాలామంది ఉన్నారని, కానీ ఎవరూ తనకు సహాయం చేయడానికి రాలేదని బాలుడు ఆరోపించాడు. కుక్క తన దుస్తులను లాక్కుంటూ తనను కరిచి వెంబడించడంతో తాను "చాలా భయపడ్డానని" అతను చెప్పాడు. ఈ పిల్లాడి తండ్రి మన్ఖుర్డ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు సోహైల్ ఖాన్ పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 291 (ప్రాణానికి హాని కలిగించే నిర్లక్ష్యం), 125 (ఉద్దేశపూర్వకంగా హాని), మరియు 125A (ప్రమాదకరమైన జంతువును ఉపయోగించి హాని కలిగించడం) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును ఇప్పుడు విచారిస్తున్నారు.



Tags:    

Similar News