Viral Video : ఏం దైర్యం సామీ నీది..పాము నోట్లో తల పెట్టి ఫోటోలకు ఫోజులా? మృత్యువుతో మజాక్ అంటే ఇదే!
ప్రకృతిలో అనేక రకాల జీవులు ఉన్నప్పటికీ, అనకొండ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. మనుషులను సైతం అమాంతం మింగేయగల భారీ కాయం, భయంకరమైన పట్టు దీని సొంతం.
Viral Video : ఏం దైర్యం సామీ నీది..పాము నోట్లో తల పెట్టి ఫోటోలకు ఫోజులా? మృత్యువుతో మజాక్ అంటే ఇదే!
Viral Video : ప్రకృతిలో అనేక రకాల జీవులు ఉన్నప్పటికీ, అనకొండ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. మనుషులను సైతం అమాంతం మింగేయగల భారీ కాయం, భయంకరమైన పట్టు దీని సొంతం. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి ఏకంగా అనకొండ నోట్లోనే తల పెట్టి స్టంట్ చేయబోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక భారీ అనకొండ తన నోటిని పెద్దగా తెరిచి ఉండటం కనిపిస్తుంది. ఇంతలో ఒక వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా తన తలను ఆ పాము నోటి లోపల పెట్టేందుకు ప్రయత్నించాడు. ఆ భారీ జీవి ఏమీ చేయదని అతను భావించాడు కానీ, మరుక్షణమే సీన్ రివర్స్ అయింది. అనకొండ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోతూ ఆ వ్యక్తి తలను గట్టిగా పట్టేసుకుంది. అక్కడ ఉన్న ఇతర సిబ్బంది అతడిని విడిపించేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఆ పాము పట్టు వదల్లేదు. ఈ దృశ్యం చూస్తుంటే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది.
ఈ వీడియో నెట్టింట వైరల్ అయినప్పటికీ, దీనిపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. వీడియోను నిశితంగా గమనిస్తే ఇది AI సాయంతో రూపొందించినట్లుగా అనిపిస్తోంది. సాధారణంగా ఏ వైల్డ్ లైఫ్ నిపుణుడు కూడా అనకొండ లాంటి ప్రమాదకరమైన జీవి నోట్లో తల పెట్టే సాహసం చేయరు. కాంతి, నీడలు, పాము కదలికలు కూడా కొంచెం అసహజంగా ఉండటంతో ఇది ఏఐ మ్యాజిక్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఈ వీడియో సృష్టించిన భయం మాత్రం తక్కువేమీ కాదు.
ఈ భయంకరమైన వీడియోను ఎక్స్ లో @StellaFish24481 అనే యూజర్ షేర్ చేశారు. కేవలం 15 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా వీక్షించారు. వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. ఇది పిచ్చితనం కాకపోతే మరేంటి?, ప్రాణాలతో చెలగాటం వద్దు అని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఇది పక్కా ఏఐ వీడియో, ఇలాంటి వాటిని నమ్మకండి అని చెబుతున్నారు. ఏది ఏమైనా, ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయకూడదనే హెచ్చరికను మాత్రం ఈ వీడియో ఇస్తోంది.