Viral Video: మొసలితో ఆటలేంటి సామీ.. వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే..!
Viral Video: మనలో కొందరికి సాహసాలు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అయితే సరదా సాహసాలు చేస్తే చూడ్డానికి బాగానే ఉంటాయి.
Viral Video: మొసలితో ఆటలేంటి సామీ.. వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే..!
Viral Video: మనలో కొందరికి సాహసాలు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అయితే సరదా సాహసాలు చేస్తే చూడ్డానికి బాగానే ఉంటాయి. కానీ ఆ సాహసాలు ప్రాణం మీదికి తీసుకొచ్చేవి అయితే. అస్సలు బాగోదు కదూ! ఇటీవల ఇలాంటి సాహసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో లైక్స్, ట్రెంఢ్ అవ్వాలని చాలా మంది ఇలాంటి సాహసాలకు ఒడిగడుతున్నారు.
ప్రతీ రోజూ వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో వణుకు పుట్టిస్తోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో అంతలా ఏముందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. మొసళి ఈ పేరు గుర్తురాగానే ఏదో తెలియని భయం కలగడం ఖాయం. భారీ ఖాయం, పదునైన పళ్లతో చూడ్డానికి ఎంతో భయంకరంగా ఉంటాయి.
అయితే ఇలాంటి మొసలితో ఓ వ్యక్తి గేమ్స్ ఆడాడు. ఓ పెద్ద మొసలి నీటిలో ఉంది. నది ఒడ్డున నిలబడి ఉన్న వ్యక్తి, తన చేతిలో మాంసం ముక్క పట్టుకుని మొసలిని దగ్గరకు రప్పించేలా ప్రవర్తించాడు. మొసలి దగ్గరికి వచ్చిన సమయంలో ఆహారాన్ని ఎత్తేసి, వెనక్కి వెళ్తున్నాడు. దీనితో మొసలి అసహనంతో, అతని వైపు వేగంగా దూసుకెళ్లింది. అయితే ఆ వ్యక్తి ఆగలేదు. మళ్లీ అదే రీతిలో మరోసారి ప్రయత్నించాడు. మొసలిని రెచ్చగొట్టేలా ప్రవర్తించడమే కాకుండా, ఏ దశలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు.
చివరికి మొసలి ఆహారాన్ని గట్టిగా పట్టుకుని తిరిగి నీటిలోకి వెళ్లిపోయింది. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అంతటి క్రూర జంతువుతో ఆటలు ఏంటి బ్రో అంటూ ఒకరు కామెంట్ చేయగా. మరో వ్యక్తి.. ‘‘మొసలికి ఫుడ్ పెడుతున్నాడు. ఏమాత్రం పొరపాటున జరిగినా మొసలికే ఫుడ్ అవుతాడు' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.