Viral Video: ఇలా చేస్తే చెప్పులు ఎందుకు పోతాయి చెప్పండి.. అన్న ఐడియా అదుర్స్ అసలు
Viral Video: దేవాలయాల బయట చెప్పులను వదిలి గుళ్లోకి వెళ్తుంటాం. అయితే గుడిలోకి వెళ్లి వచ్చేదాక ధ్యాస అంతే చెప్పుల పైనే ఉంటుంది. చెప్పుల స్టాండ్‌లో పెట్టి వెళ్తే ఎలాంటి టెన్షన్ ఉండదు కానీ బయట వదిలి వెళ్తే మాత్రం ఆలోచన ఉంటుంది.
Viral Video: ఇలా చేస్తే చెప్పులు ఎందుకు పోతాయి చెప్పండి.. అన్న ఐడియా అదుర్స్ అసలు
Viral Video: దేవాలయాల బయట చెప్పులను వదిలి గుళ్లోకి వెళ్తుంటాం. అయితే గుడిలోకి వెళ్లి వచ్చేదాక ధ్యాస అంతే చెప్పుల పైనే ఉంటుంది. చెప్పుల స్టాండ్‌లో పెట్టి వెళ్తే ఎలాంటి టెన్షన్ ఉండదు కానీ బయట వదిలి వెళ్తే మాత్రం ఆలోచన ఉంటుంది. అందుకే ఓ అన్న వెరైటీ ఆలోచన చేశాడు. చెప్పులను భద్రంగా దాచుకునేందుకు ఆయన చేసిన పని ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన చేసిన పనెంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ఓ వ్యక్తి గుడి ముందు చెప్పులను వదిలి వెళ్లాడు. అయితే గుడిలోకి వెళ్లి వచ్చే వరకు చెప్పులకు ఏం కాకుడాదని ఓ సూపర్ ప్లాన్ చేశాడు. రెండు చెప్పులను ఒకే చోట పెట్టి వాటికి తాళం వేశాడు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఆ చెప్పులు ఎవరైనా ఎత్తుకెళ్లాలంటే తాళం తీస్తే తప్ప వేసుకోడానికి రావు..అలా దొంగలకి షాకిచ్చాడు ఆ వ్యక్తి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చెప్పులు ఎత్తుకెళ్తే తాళం ఫ్రీ అన్నట్టు బంపరాఫర్ ఇచ్చాడుగా అని కొందరు.. ఆ చెప్పులకంటే తాళం ధర ఎక్కువ ఉండొచ్చని మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.