Viral Video: చేపల వేటకు వెళ్లిన వ్యక్తికి షాక్ – నీటిలో కనిపించింది చూసి అవాక్కు

చేపల వేట అంటే చాలా మందికి సరదా. మన దేశంలో ఈ హాబీ కొంచెం తక్కువైనా, విదేశాల్లో మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంది. నది ఒడ్డునో, సరస్సు దగ్గరో చేపలు పట్టేందుకు గాలం వేసి కూర్చోవడం వాళ్లకు అలవాటు. అలాంటి హాబీతో ఓ వ్యక్తి సరస్సు దగ్గరకు వెళ్లాడు. గాలం వేసి కొంతసేపు వేచిచూసాడు. కానీ కాసేపటికి నీటి అడుగున కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

Update: 2025-08-18 17:03 GMT

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఆ వ్యక్తి చేపలు పడతానని సరస్సులో గాలం వేసాడు. అయితే గాలం పడిన చోట ఆగింది చేప కాదు.. ఏకంగా ఓ భారీ మొసలి! అది నీటిలోంచి అతడి వైపు చూసిన తీరు చూసి వేటగాడు భయంతో గబగబా వెనక్కి తగ్గాడు. సాధారణ మొసలి కాదు.. పెద్ద కాయంతో కనిపించడంతో మరింత భయపడ్డాడు.

ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవ్వగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. “ఆస్ట్రేలియా వాటర్స్‌లోకి ఎప్పుడూ వెళ్లకూడదు.. ఇదే కారణం” అంటూ నెటిజన్లు వరుసపెట్టి కామెంట్లు చేస్తున్నారు.

 ఆ వీడియో మీరూ చూసేయండి, ఎందుకు వైరల్ అయిందో మీకే అర్థమవుతుంది!

Tags:    

Similar News