Viral Video: మోనాలీసాను మించిన అందం.. మాఘీ మేళలో మరో యువతి వైరల్

Viral Video: ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న మాఘీ మేళ సందర్భంగా మరో యువతి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Update: 2026-01-01 11:47 GMT

Viral Video: మోనాలీసాను మించిన అందం.. మాఘీ మేళలో మరో యువతి వైరల్

Viral Video: ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న మాఘీ మేళ సందర్భంగా మరో యువతి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో కుంభమేళలో మోనాలీసా ఎలా అయితే ఒక్క రాత్రిలో ఫేమస్ అయ్యిందో, ఇప్పుడు అలాగే మాఘీ మేళలో పూసల దండలు అమ్మేందుకు వచ్చిన మాహీ మలాల్ అనే యువతి నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

త్రివేణి సంగమంలో జరుగుతున్న మాఘీ మేళకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మాహీ మలాల్ పూసల దండలు అమ్ముతుండగా కొంతమంది యూట్యూబర్లు ఆమె వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఆమె కళ్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వైరాలిటీ కారణంగా ఆమె చుట్టూ జనాలు గుమిగూడుతుండటంతో తన వ్యాపారం సరిగ్గా జరగడం లేదని మాహీ మలాల్ ఆవేదన వ్యక్తం చేసింది. “మోనాలీసాలా నేను కూడా ఫేమస్ అవుతానా?” అని సరదాగా నవ్వుతూ స్పందించింది.

మొత్తానికి మాఘీ మేళ వేళ మరో సాధారణ యువతి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. గతంలో మోనాలీసాకు సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లే, ఇప్పుడు ఈ యువతి కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.




Tags:    

Similar News