Viral Biryani Video : ఇంతటి బిర్యానీ భక్తుడిని ఎప్పుడూ చూసుండరు..సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్యూట్ వీడియో
Viral Biryani Video : భారతదేశంలో బిర్యానీ అనేది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఈ విషయాన్ని కోల్‌కతాకు చెందిన ఒక బుజ్జిగాడు తన క్యూట్ రియాక్షన్‌తో మరోసారి నిరూపించాడు.
Viral Biryani Video : ఇంతటి బిర్యానీ భక్తుడిని ఎప్పుడూ చూసుండరు..సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్యూట్ వీడియో
Viral Biryani Video : భారతదేశంలో బిర్యానీ అనేది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఈ విషయాన్ని కోల్‌కతాకు చెందిన ఒక బుజ్జిగాడు తన క్యూట్ రియాక్షన్‌తో మరోసారి నిరూపించాడు. బిర్యానీ పార్శిల్ చూడగానే ఆ చిన్నారి వ్యక్తం చేసిన ఆనందం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. సాధారణంగా పిల్లలకు చాక్లెట్లు అన్నా, ఐస్‌క్రీమ్ అన్నా ఇష్టం ఉంటుంది. కానీ ఈ కోల్‌కతా బుజ్జిగాడికి మాత్రం బిర్యానీ అంటే పిచ్చి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక చిన్నారి చేతిలో ఫుడ్ పార్శిల్ పట్టుకుని గదిలోకి పరిగెత్తుకుంటూ వస్తాడు. రావడం రావడమే ఎగిరి గంతేస్తూ "బిర్యానీ.. బిర్యానీ.." అని అరుస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ చిన్నారి ముఖంలో కనిపిస్తున్న ఆనందం చూస్తుంటే, వాడు ఆ బిర్యానీ కోసం ఎంత ఆశగా ఎదురుచూశాడో అర్థమవుతుంది.
అక్కడ వీడియో రికార్డ్ చేస్తున్న తన తండ్రి దగ్గరికి వెళ్లి.. "నేను బిర్యానీ ఆర్డర్ చేశాను, పదా పదా తిందాం!" అంటూ ఆత్రుతగా అడుగుతాడు. ఆ పార్శిల్ విప్పే వరకు ఆ బుజ్జిగాడికి అస్సలు నిలకడ లేదు. తండ్రిని త్వరగా వడ్డించమని మొండికేస్తూ, బిర్యానీ పేరు చెబుతూ గది అంతా తిరుగుతూ చేసిన హంగామా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ అబ్బాయి అమాయకత్వం, ఆకలి కలిసిన ఆ రియాక్షన్ చూసి అందరూ మురిసిపోతున్నారు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @_hayabloom అనే అకౌంట్ నుండి షేర్ చేశారు. దీనికి బిర్యానీ తింటాం అనే క్యాప్షన్ ఇచ్చారు. వీడియో పైన "బిర్యానీ చూస్తే ఇలాగే పిచ్చెక్కిపోతాను.. బిర్యానీ పగ్లూ (బిర్యానీ పిచ్చోడు)" అని రాసి ఉంది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే లక్షలాది వ్యూస్, వేలాది కామెంట్లతో వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఆ చిన్నారిపై ప్రేమను కురిపిస్తున్నారు.
నెటిజన్ల కామెంట్స్ కూడా చాలా సరదాగా ఉన్నాయి. ఒక యూజర్ "నిజంగానే వీడు బిర్యానీ పగ్లూ.. ఎంత క్యూట్‌గా ఉన్నాడో" అని కామెంట్ చేయగా, మరొకరు "ప్రతి ఆదివారం బిర్యానీ తినాల్సిందే, లేదంటే ఆ కిక్కే వేరు" అని రాశారు. "ఈ బాబు సంతోషం చూస్తుంటే నాకు కూడా బిర్యానీ తినాలనిపిస్తోంది.. దిష్టి తగలకుండా ఉండాలి" అంటూ మరికొందరు దీవిస్తున్నారు. మొత్తానికి ఈ చిన్నారి బిర్యానీ వీడియో ఇంటర్నెట్‌లో హాట్ కేక్‌లా మారిపోయింది.