Viral Video: స్టోర్‌ రూమ్‌లో ఏదో శబ్ధం.. ఏంటా అని చూడగా బుసలు కొడుతూ

Viral Video: పాములు ఇళ్లలోకి రావడం సర్వ సాధారణమైన విషయం. ముఖ్యంగా వేసవిలో ఎక్కడెక్కడలో ఉన్న పాములన్నీ బయటకు వస్తాయి.

Update: 2025-03-21 07:55 GMT

Viral Video: స్టోర్‌ రూమ్‌లో ఏదో శబ్ధం.. ఏంటా అని చూడగా బుసలు కొడుతూ

Viral Video: పాములు ఇళ్లలోకి రావడం సర్వ సాధారణమైన విషయం. ముఖ్యంగా వేసవిలో ఎక్కడెక్కడలో ఉన్న పాములన్నీ బయటకు వస్తాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక చల్లటి ప్రదేశాల కోసం అన్వేషిస్తుంటాయి. ఇందులో భాగంగానే ఇళ్లలోకి చొరబడుతుంటాయి. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో అంతలా ఏముందనేగా.?

ఓ ఇంటి వెనకాల స్టోర్‌ రూమ్‌ ఉంది. అందులో నుంచి ఏదో శబ్ధాలు వస్తున్నట్లు గుర్తించిన యజమాని వెంటనే స్నేక్‌ సొసైటీకి సమాచారం అందించాడు. దీంతో కొద్ది సేపటికే అక్కడికి వచ్చిన వ్యక్తి ఆ గదిలో కింగ్‌ కోబ్రా ఉన్నట్లు గుర్తించాడు. మొదట దాని తోక కనిపించడంతో చాకచక్యంగా దానిని బంధించేందుకు ప్రయత్నించారు. పాము కర్రల మధ్య దాక్కోవాలని ప్రయత్నించినా.. స్నేక్ టీమ్ సభ్యులు ఎంతో నైపుణ్యంతో దానిని బయటికి తీశారు.

ఆ సమయంలో పాము పలుమార్లు వారిని కాటు వేయబోయింది. అయినా వెనకడుగేయకుండా ఎంతో జాగ్రత్తగా దాన్ని సంచిలో వేసి సమీప అడవిలో వదిలిపెట్టారు. దీనంతటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి స్మార్ట్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశాడు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి పాము ఇంట్లోకి వస్తే ఇంకేమైనా ఉందా.? అంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో సమాచారం లేదు కానీ నెట్టింట మాత్రం ఓ రేంజ్‌లో ట్రెండ్‌ అవుతోంది. 


Tags:    

Similar News