Viral Video: ఎదురుగా ఎద్దు.. రోడ్డు మధ్యలో జాగ్వార్లు.. వెనక్కు తిరిగి చూడగానే..
Viral Video: పులులు, సింహాలను చూస్తే మిగతా జంతువులు భయపడటం మామూలే.
Viral Video: ఎదురుగా ఎద్దు.. రోడ్డు మధ్యలో జాగ్వార్లు.. వెనక్కు తిరిగి చూడగానే..
Viral Video: పులులు, సింహాలను చూస్తే మిగతా జంతువులు భయపడటం మామూలే. వీటి ఎదుటే తాము బతకతగలమో లేదోననే ఆందోళనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తుంటాయి. అయితే ఎల్లప్పుడూ పెద్ద జంతువులకే పైచేయి ఉంటుందా? అంటే అదీ తప్పే. కొన్ని సార్లు చిన్న జంతువులు సైతం తమ ధైర్యంతో పెద్దవాటిని వెనక్కి నెట్టి ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇటువంటి ఒక విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో అడవిలోని రోడ్డుమధ్య రెండు జాగ్వార్లు వేట కోసం ఎదురుచూస్తుంటాయి. కొద్ది సేపటికి ఆ దారిలో ఓ భారీ ఎద్దు ధైర్యంగా నడుస్తూ వస్తుంది. జాగ్వార్లను చూసినప్పటికీ, ఎద్దులో ఏమాత్రం భయం కనిపించదు. దీనికి భయపడాల్సిన జాగ్వార్లే ఎద్దు దగ్గరకి రాగానే భయంతో అక్కడి నుంచి తప్పించుకుంటాయి.
రోడ్డు పక్కకు తప్పుకున్న జాగ్వార్ల వెంట ఎద్దు కూడా పరుగుపెడుతూ దాడి చేసేలా పరుగులెడుతుంది. దీంతో మరింత భయపడిన జాగ్వార్లు పొదల్లోకి పారిపోతాయి. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు ‘‘ఎద్దు ధైర్యానికి జాగ్వార్లే పరారయ్యాయంటే గొప్ప విషయమే’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.