Viral Video: భర్తల డే కేర్‌ సెంటర్‌.. ఈ ఐడియా ఏదో బాగుంది కదూ! వైరల్‌ వీడియో

Viral Video: భార్యలతో షాపింగ్‌ వెళ్లిన సమయంలో భర్తలు ఎదుర్కొనే కష్టాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-03-07 09:20 GMT

Viral Video: భర్తల డే కేర్‌ సెంటర్‌.. ఈ ఐడియా ఏదో బాగుంది కదూ! వైరల్‌ వీడియో

Viral Video: భార్యలతో షాపింగ్‌ వెళ్లిన సమయంలో భర్తలు ఎదుర్కొనే కష్టాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అంశంపై ఎన్నో రకాల జోకులు పేలుతుంటాయి. భార్యల షాపింగ్‌ భర్తలకు పెద్ద పరీక్షగా మారుతుంది. షాపింగ్‌కు వెళ్లేముందు ఒకటి అనుకుని, అక్కడికి వెళ్లాక మరోటి తీసుకోవడం కామన్. సమయం పెరిగిపోవడంతో పాటుగా బిల్లు కూడా భారీగా పెరుగుతుంది. ఈ పరిస్థితిని చూపించే ఫన్నీ రీల్స్, వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటూ.. ‘‘ఇకపై భార్యలు షాపింగ్‌ చేస్తే భర్తలకు అసలైన పండుగే’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓ షాపింగ్‌ మాల్‌ బయట కనిపించిన ఓ బోర్డు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ షాపింగ్ మాల్‌ దగ్గర ఏర్పాటు చేసిన బోర్డుపై.. 'మీరు షాపింగ్‌కి వెళ్లినా, మరెక్కడికైనా వెళ్లినా.. మీ భర్తలను ఇక్కడ వదిలిపెట్టండి' అని రాసి ఉంది. అంతేకాదు, అక్కడ కోల్డ్‌ బీరు అందుబాటులో ఉందని, రగ్బీ చూడొచ్చని కూడా ప్రస్తావించారు. సాధారణంగా పిల్లలను కేర్‌ సెంటర్లలో వదిలిపెడుతుంటారు.

కానీ భర్తల కోసం డే కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనిని వీడియోగా తీసి ఎవరో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తెగ సంబురపడుతున్నారు. ఇలాంటిది ఒకటి తమ దగ్గర కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 


Tags:    

Similar News