Viral Video: ఇంగ్లిష్‌లో పక్కా ఇండియన్ యాసతో జర్మన్ యువతి వీడియో వైరల్..!

Viral Video: తాజాగా ఓ జర్మన్ యువతి ఇంగ్లిష్‌ను ఏకంగా పక్కా ఇండియన్ యాసలో మాట్లాడుతూ వీడియో షేర్ చేయడంతో నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు.

Update: 2025-06-28 14:34 GMT

Viral Video: ఇంగ్లిష్‌లో పక్కా ఇండియన్ యాసతో జర్మన్ యువతి వీడియో వైరల్..!

Viral Video: విదేశీయులు భారత భాషలు నేర్చుకోవడం, మన సంస్కృతిని ఆదరించడం పెద్దగా ఆశ్చర్యంగా అనిపించదు. కానీ తాజాగా ఓ జర్మన్ యువతి ఇంగ్లిష్‌ను ఏకంగా పక్కా ఇండియన్ యాసలో మాట్లాడుతూ వీడియో షేర్ చేయడంతో నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్న క్లారా అనే యువతి, తన ఇండియన్ యాసపై వస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

క్లారా ఓ స్కూల్ టీచర్. ఆమె తరచూ ఎదుర్కొనే ప్రశ్న – “భారతీయురాలు కాకపోయినా ఇంగ్లీష్‌లో ఇండియన్ యాస ఎలా వచ్చిందని?” – అన్నదానికి ఈ వీడియోలో సున్నితంగా, సరదాగా సమాధానం ఇచ్చారు. “నిజమే, నేను జర్మన్‌ అమ్మాయి. కానీ నా ఇంగ్లిష్‌లో ఇండియన్ యాసకు కారణాలు ఉన్నాయి,” అని క్లారా వెల్లడించారు.

క్లారా తెలిపిన మొదటి కారణం — “నేను ఇంగ్లీష్ మాట్లాడేది ఎక్కువగా భారతీయులతోనే. మనం ఎవరితో ఎక్కువగా మాట్లాడతామో వారి యాసే మనపై ప్రభావం చూపుతుంది.”

రెండో కారణం — “నేను మలయాళం నేర్చుకున్నాను. మలయాళంలో మాట్లాడేటప్పుడు ఎన్నో ఇంగ్లీష్ పదాలు వాడతాం. అవన్నీ ఇండియన్ యాసలోనే పలుకుతాం. ఉదాహరణకు ‘ఫ్రిడ్జ్’ అనే పదాన్ని బ్రిటిష్ యాసలో చెప్పాలంటే తప్పుగా అనిపిస్తుంది. అందుకే నా ఇంగ్లిష్‌లో భారతీయత ఉంది” అని వివరించారు.


ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 6.38 లక్షల వ్యూస్, 24 వేల లైక్స్ వచ్చాయి. క్లారా వివరించిన ఈ యాస ప్రయాణం నెటిజన్ల మనసులను గెలుచుకుంది.

ఒక యూజర్ కామెంట్ చేస్తూ, “మనకు అర్థమయ్యేలా మనం మాట్లాడే యాస మార్చుకోవడం సహజమే,” అని పేర్కొన్నారు. మరొకరు, “మీ మాటల్లో కేరళ టచ్ స్పష్టంగా కనిపిస్తోంది!” అంటూ స్పందించారు.

ఇంకొకరు అయితే – “మీకు జర్మన్, మలయాళం, ఇంగ్లిష్‌ అన్నింటినీ భారతీయ వేదికలపై పలికే శైలి ఉంది... ఇది అసాధారణం” అంటూ ప్రశంసలు కురిపించారు.



Tags:    

Similar News