Viral Video: చిన్నారి చేతిలోనే కోబ్రా.. భయపడకుండా ఆడుకుంటున్న వీడియో ట్రెండ్ అవుతోంది
సోషల్ మీడియాలో తరచూ వింతవింత వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో చిన్నారుల వీడియోలు ప్రత్యేక ఆకర్షణగా మారుతాయి. తాజాగా ఒక చిన్నారి వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటైన కోబ్రాను ఆ బాలుడు భయపడకుండా చేతిలో పట్టుకున్నాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పామును తోక పట్టుకుని లాగుతూ, అది ఏదో ఆటబొమ్మలాంటిదిగా చిన్నారి ఆడుకున్నాడు. అంతే కాదు.. ఒక కర్ర సహాయంతో పాము నోటిని నొక్కి, దాని దవడ పట్టుకుని పైకి ఎత్తేశాడు. అతని ముఖంలో ఎలాంటి భయం కనబడలేదు.
వీడియోలో కనిపిస్తున్న ఈ దృశ్యం చూసి చాలామంది నెటిజన్లు షాక్ అయ్యారు.
"పాము కాటు క్షణాల్లో ప్రాణం తీస్తుంది.. అలాంటి ఆటకు ఎలా వదిలేశారు?" అంటూ తల్లిదండ్రులపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇంకొందరు మాత్రం బాలుడి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. బహుశా పాము విషం తొలగించబడి ఉండవచ్చని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.