Viral Video: ముంబైలో ఒక కప్పు టీ రేటు విని దుబాయ్ ఎన్నారై షాక్..!
ఒక కప్పు టీకి వెయ్యి రూపాయలేనా..? “ఇండియాలో నేను పేదవాడిలా ఫీల్ అయ్యా” అంటూ దుబాయ్‌లో ఉండే ఓ ఎన్నారై తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
Viral Video: ముంబైలో ఒక కప్పు టీ రేటు విని దుబాయ్ ఎన్నారై షాక్..!
ఒక కప్పు టీకి వెయ్యి రూపాయలేనా..? “ఇండియాలో నేను పేదవాడిలా ఫీల్ అయ్యా” అంటూ దుబాయ్‌లో ఉండే ఓ ఎన్నారై తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దిర్హామ్‌లలో సంపాదించే తానూ భారత్ పర్యటనలో ఖర్చులతో ఇబ్బంది పడ్డానని చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది.
వివరాల్లోకి వెళ్తే… దుబాయ్‌కి చెందిన ట్రావెల్ వ్లాగర్ పరిక్షిత్ బలోచి ఇటీవల ఇండియాకు వచ్చారు. ఈ సందర్భంగా ముంబైలోని ఒక హోటల్‌లో టీ తాగగా, ఒక్క కప్పు టీకి వెయ్యి రూపాయలు బిల్లు రావడంతో షాక్ అయ్యారు. ఆ వీడియోలో బలోచి మాట్లాడుతూ –
“ఇక్కడ నేను పేదవాడిలా అనిపించింది. భారత్‌లో ఇంత ఖర్చు ఉంటుందని ఊహించలేదు. ముందు కరెన్సీ మారకం వల్ల ఎన్నారైలకు భారత్‌లో ఖర్చులు తక్కువగా అనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది” అని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే ఈ వీడియోకు ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు కూడా ఆయనతో ఏకీభవిస్తూ, ముంబై వంటి మెట్రో నగరాల్లో ఖర్చులు ఎంత విపరీతంగా పెరిగాయో తమ అనుభవాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు.