Viral Video: త్రివర్ణ పతాకాన్ని పెయింట్ చేసిన కుక్క… శునకం దేశభక్తికి నెటిజన్స్ వావ్!
ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో తిరిగే వీధి కుక్కలను షెల్టర్ హోమ్‌లకు పంపాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని సమర్థిస్తుండగా, చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Viral Video: త్రివర్ణ పతాకాన్ని పెయింట్ చేసిన కుక్క… శునకం దేశభక్తికి నెటిజన్స్ వావ్!
ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో తిరిగే వీధి కుక్కలను షెల్టర్ హోమ్‌లకు పంపాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని సమర్థిస్తుండగా, చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించి నిరసనలు తెలిపారు. కొన్ని కుక్కల తప్పుల కారణంగా అన్ని కుక్కలను శిక్షించడం సరికాదని జంతు ప్రేమికులు అంటున్నారు.
ఇలాంటి వేళలో ఒక వీధి కుక్క దేశభక్తిని చాటిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలు దీనిని ప్రేమతో “దేశభక్తి కుక్క” అని పిలుస్తున్నారు. వీడియోలో ‘డాలీ’ అనే కుక్క తన నోటితో పెయింట్ బ్రష్ పట్టుకుని తెల్ల కాగితంపై త్రివర్ణ పతాకాన్ని గీయడం కనిపిస్తుంది. మొదట ఆకుపచ్చ రంగు, తరువాత కాషాయ రంగు పెయింట్ చేసి, యజమానురాలు సహాయంతో పూర్తి చేసిన ఆ పెయింటింగ్ సరిగ్గా మన జాతీయ పతాకంలా మెరిసింది.
ఇది త్రివర్ణ పతాకాన్ని పెయింట్ చేసిన మొదటి భారతీయ కుక్క అని చాలామంది చెబుతున్నారు. వీడియో చూసిన నెటిజన్స్ విభిన్నంగా స్పందించారు. “బాగా చేసావు డాలీ… ఢిల్లీలో వీధి కుక్కలకు సహాయం చేయడానికి ఇంకో పెయింటింగ్ వేయి” అని ఒకరు రాయగా, మరొకరు “డాలీ తన స్నేహితులు దేశంలో సురక్షితంగా ఉండాలని ఆశతో ఈ జెండాను గీసింది” అని కామెంట్ చేశారు.
వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హృదయానికి హత్తుకునేలా హల్‌చల్ చేస్తోంది.