Viral Video: జీపు కిందికి మొసలి.. కదలకుండా ఆపేసిన దృశ్యం నెట్టింట వైరల్!

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ మొసలికి సంబంధించిన అద్భుతమైన ఘటన వీడియో రూపంలో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆస్ట్రేలియాలోని కాకడు నేషనల్ పార్క్‌లోని కాహిల్స్ క్రాసింగ్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Update: 2025-07-31 14:33 GMT

అక్కడ నీటిలో భారీగా మొసళ్లు ఉంటాయని స్థానికులకు తెలుసు. అయితే ఓ వ్యక్తి తన జీపుతో ఆ నదిని దాటుతున్న సమయంలో అనూహ్యంగా ఓ పెద్ద మొసలి జీపు కిందకు వచ్చేసింది. దీంతో జీపు కదలకుండా అక్కడే ఆగిపోయింది. డ్రైవర్‌కు కింద ఏం జరిగిందో అర్థం కాలేదు. కొన్ని క్షణాల తర్వాత మొసలి అక్కడి నుంచి పక్కకు తొలగడంతో వాహనం తిరిగి ముందుకు కదిలింది.

ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు. "నా జీవితంలో మొసలి ఓ వాహనం కింద ఇంత స్పష్టంగా చిక్కిపోవడం ఇదే మొదటిసారి" అని అతను చెప్పాడు. నీటిలో మొసలి కనిపించకపోవడంతో జీప్ డ్రైవర్‌కు ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలియలేదని చెప్పాడు.

ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో భారీగా షేర్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. జీప్ డ్రైవర్ అదృష్టం బాగుందని, అతను కిందకు దిగలేదే మంచిది అయిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఈ లొకేషన్ మరియు వీడియో థ్రిల్‌తో నిండి ఉండటంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News