Viral Video: కదులుతున్న రైలులో యువతి మెడలో తాళి కట్టిన యువకుడు..

Marriage In Train Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ఓ ప్రేమ జంట కదులుతున్న రైలు గూడ్స్‌లోనే వివాహం చేసుకున్న తీరుపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Update: 2025-07-11 06:23 GMT

Marriage In Train Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ఓ ప్రేమ జంట కదులుతున్న రైలు గూడ్స్‌లోనే వివాహం చేసుకున్న తీరుపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి పెళ్లి చూడటం చాలా అరుదైన విషయమని చెప్పొచ్చు.

వీడియో వివరాల్లోకి వెళ్తే, ఓ ప్రేమ జంట లోకల్ ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తూ ఉండగా, అదే రైలులో ఉన్న ప్రయాణికుల సమక్షంలోనే వారు పెళ్లి చేసుకున్నారు. ముందు యువకుడు తాళిబొట్టు తీసి, యువతిని సీటుపై కూర్చోబెట్టి మెడలో తాళి కట్టాడు. వెంటనే అక్కడున్న ఇతర ప్రయాణికులు పూలదండలు ఇచ్చి, వారిద్దరినీ ఒకరికొకరు దండలు మార్చుకునేలా చేశారు. అనంతరం వారు హగ్ చేసుకుంటూ, ప్రయాణికుల ఆశీర్వాదాల మధ్య పెళ్లిని పూర్తిచేశారు.

ఈ ప్రత్యేక వివాహ దృశ్యాలను తోటి ప్రయాణికులు తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. “Max Sudama 1999” అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఈ వీడియోను పోస్టు చేయగా, ఇప్పటికే దానికి 85 వేలకుపైగా లైక్స్ వచ్చాయి.

నెటిజన్లందరూ ఈ జంట ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. “ఒక్క తాళితో ప్రేమను పెళ్లిగా మార్చారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు "ఇది నిజమైన లవ్ స్టోరీ" అంటూ అభిప్రాయపడుతున్నారు.

అందరూ లక్షల రూపాయల పెళ్లిళ్లు చేసుకుంటున్న ఈ రోజుల్లో, ఓ ప్రేమ జంట సాధారణ ప్రయాణంలోనే జీవితానికి కొత్త మలుపు తిప్పడం నిజంగా హృదయాన్ని తాకే విషయం. ఈ వీడియో ప్రస్తుతం ప్రేమను, సింప్లిసిటీని మరోసారి గుర్తు చేస్తోంది.


Tags:    

Similar News