Viral Video: తెలివి తెల్లారడం అంటే ఇదే.. ఈ వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు..!
Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ, ఏ విచిత్రమైన సంఘటన జరిగినా వెంటనే నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ, ఏ విచిత్రమైన సంఘటన జరిగినా వెంటనే నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాస్త భిన్నంగా ఉంటే చాలు ప్రపంచమంతా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తోంది. కొందరు మంది మేస్త్రీలు చేసిన తెలివి తక్కువ పనికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ఇంటిని నిర్మించే ముందు మొదట చేసే పని మంచి ప్లానింగ్ వేసుకోవడం. ఎక్కడ కిటికీలు రావాలి, ఎక్కడ డోర్లు రావాలి అన్న వివరాలు సదరు ప్లాన్‌లో ఇంజనీర్లు పేర్కొంటారు. అయితే ఎలాంటి ప్లాన్ లేకుండా ఇంటిని నిర్మిస్తే ఎలా ఉంటుంది. అది కూడా తలాతోకలేకుండా నిర్మాణం చేపడితో ఎలా ఉంటుందో చెప్పేందుకు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది.
కొందరు కార్మికులు ఓ ఇంటిని నిర్మిస్తున్నారు. గదుల మధ్య గోడలను కడుతున్నారు. అయితే ఓ గదిని చాలా విచిత్రంగా కట్టారు. సహజంగా ఏ గదికి అయినా డోర్ ఉండాల్సిందే. అయితే ఈ వీడియోలో మాత్రం గదికి నాలుగు వైపులా గోడ కట్టేశారు. అసలు తలుపు అనేదే లేదు. ఓ వ్యక్తి వాళ్ల దగ్గరికి వెళ్లి ఇదేంటి డోర్ లేకుండా కడుతున్నారనేంత వరకు వారికి ఆ విషయమే అర్థం కాలేదు. ఆ తర్వాత ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.
దీంనంతటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు ఈ వీడియోను సుమారు 7 లక్షల మంది వరకు వీక్షించారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లు ఎవరో యూట్యూబ్‌లో చూసి క్రాష్ కోర్స్ చేసినట్లున్నారు అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.