Viral Video : కదులుతున్న రైలుపైకి జనం దండయాత్ర..వైరల్ వీడియో చూస్తే వెన్నులో వణుకే!

Viral Video : రైలు ప్రయాణం అంటేనే ఒకప్పుడు ఎంతో హాయిగా ఉండేది. కానీ ఇప్పుడు రద్దీ పెరిగిపోవడంతో అది ఒక అగ్ని పరీక్షలా మారుతోంది.

Update: 2025-12-28 06:03 GMT

Viral Video : కదులుతున్న రైలుపైకి జనం దండయాత్ర..వైరల్ వీడియో చూస్తే వెన్నులో వణుకే!

Viral Video: రైలు ప్రయాణం అంటేనే ఒకప్పుడు ఎంతో హాయిగా ఉండేది. కానీ ఇప్పుడు రద్దీ పెరిగిపోవడంతో అది ఒక అగ్ని పరీక్షలా మారుతోంది. ముఖ్యంగా ముంబై వంటి నగరాల్లో రైలు ప్రయాణం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పోరాటం చేయడమే. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టక మానదు. కదులుతున్న రైలులోకి జనం ఎలా ఎగబడుతున్నారో, ప్రమాదాలకు ఎలా ఆహ్వానం పలుకుతున్నారో ఈ వీడియో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో రైలు ప్లాట్‌ఫాంపై స్పీడుగా కదులుతోంది. అక్కడ వందలాది మంది జనం రైలు కోసం వేచి చూస్తున్నారు. రైలు ఆగకముందే ఒక వ్యక్తి కదులుతున్న బోగీలోకి ఎక్కే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. అదృష్టవశాత్తూ అతడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ, అది చూసిన తర్వాతైనా మిగిలిన వారు జాగ్రత్త పడతారని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆ వ్యక్తి పడటం చూస్తూనే మరో పది పదిహేను మంది ఏకకాలంలో కదులుతున్న రైలుపైకి దూకారు. చాలామంది గేటు దగ్గరే తడబడ్డారు, మరికొందరు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ దృశ్యాలు ముంబై లోకల్ రైలుకు సంబంధించినవని తెలుస్తోంది.



ఈ షాకింగ్ వీడియోను Xలో @Ilyas_SK_31 అనే యూజర్ షేర్ చేశారు. "ముంబై లోకల్ నగరం లైఫ్‌లైన్ కావచ్చు, కానీ ఇలా కదులుతున్న రైలు ఎక్కడం మృత్యువుతో చెలగాటమే. బాస్ తిట్లు లేదా ఆఫీస్ పని కంటే మీ ప్రాణం మీ కుటుంబానికి ముఖ్యం. 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, సురక్షితంగా ఇంటికి చేరడం ముఖ్యం" అంటూ భావోద్వేగపూరితమైన క్యాప్షన్ ఇచ్చారు. కేవలం 21 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పటికే వేల సంఖ్యలో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ముంబై వంటి నగరాల్లో రద్దీ తట్టుకోలేక జనం ఇలా చేస్తున్నారని కొందరు అంటున్నా, ఇది ముమ్మాటికీ ఆత్మహత్యాసదృశ్యమేనని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. "జీవితం చాలా విలువైనది, ఒక్క సెకను తప్పు చేస్తే శవం పట్టాల మీద ఉంటుంది" అని ఒకరు హెచ్చరించగా.. "రద్దీ ఎక్కువగా ఉంటే ప్రభుత్వం రైళ్ల సంఖ్య పెంచాలి కానీ, ఇలా జనం ప్రాణాలకు తెగించడం తప్పు" అని మరొకరు కామెంట్ చేశారు. ముంబై లోకల్స్‌లో ఇలాంటి దృశ్యాలు నిత్యకృత్యం కావడం విచారకరమని, రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని ఘోర ప్రమాదాలు జరుగుతున్నా, జనం మాత్రం తమ పద్ధతి మార్చుకోవడం లేదని ఈ వీడియో మరోసారి నిరూపించింది.

Tags:    

Similar News