Viral Video: పాములంటే ఆమెకు పిచ్చి.. బెడ్‌రూమ్‌లో కుప్పల కుప్పలుగా పాములు!
కొంతమంది జీవనశైలి, అలవాట్లు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. చైనాకు చెందిన ఓ యువతి కూడా అలాంటి వారిలో ఒకరు. ఆమెకు పాములంటే విపరీతమైన ఇష్టం. అంతేకాదు, వాటి కోసం ప్రత్యేకంగా ఒక బెడ్‌రూమ్ సిద్ధం చేసింది.
Viral Video: పాములంటే ఆమెకు పిచ్చి.. బెడ్‌రూమ్‌లో కుప్పల కుప్పలుగా పాములు!
కొంతమంది జీవనశైలి, అలవాట్లు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. చైనాకు చెందిన ఓ యువతి కూడా అలాంటి వారిలో ఒకరు. ఆమెకు పాములంటే విపరీతమైన ఇష్టం. అంతేకాదు, వాటి కోసం ప్రత్యేకంగా ఒక బెడ్‌రూమ్ సిద్ధం చేసింది. ఆ గదిలోని మంచంపై దుప్పటి ఎత్తగానే కుప్పల కుప్పలుగా పాములు కనిపిస్తాయి.
ఇటీవల ఆమె పాముల పిచ్చికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. sports.jx.china అనే X ఖాతా షేర్ చేసిన ఈ వీడియోలో, యువతి మంచంపై ఉన్న దుప్పటిని ఎత్తి పాములను ఒక్కొక్కటిగా నేలపైకి విసరడం, తరువాత మంచాన్ని శుభ్రం చేయడం కనిపిస్తుంది.
ఈ యువతి తన ఇంటినే పాముల పెంపక కేంద్రంగా మార్చుకుంది. అందుకే ప్రతిరోజూ ఈ రీతిలో పాములను మంచం మీద నుంచి దించి గది శుభ్రం చేస్తుంది. ఈ విచిత్ర వీడియోను ఇప్పటికే 8.2 మిలియన్లకుపైగా మంది వీక్షించారు.