Viral Video : టాలెంట్ కి హద్దులు లేవు.. కానీ సేఫ్టీ కి ఉండాలిగా.. 4 ఏళ్ల బుడ్డోడి డ్రైవింగ్ వీడియో వైరల్!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ, తాజాగా ఒక 4 ఏళ్ల బుడతడు చేసిన పని చూసి నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు.

Update: 2025-12-30 05:40 GMT

Viral Video : టాలెంట్ కి హద్దులు లేవు.. కానీ సేఫ్టీ కి ఉండాలిగా.. 4 ఏళ్ల బుడ్డోడి డ్రైవింగ్ వీడియో వైరల్!

Viral Video : సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ, తాజాగా ఒక 4 ఏళ్ల బుడతడు చేసిన పని చూసి నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ చిన్నారి డ్రైవింగ్ స్కిల్స్ చూసి కొందరు వావ్.. చిన్నారి ఉస్తాద్ అని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం ఇది పచ్చి నిర్లక్ష్యమని, ప్రమాదకరమని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతమైన చర్చకు దారితీసింది.

వైరల్ అవుతున్న ఈ వీడియో ఒక అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్ పార్కింగ్‌లో జరిగింది. ఇందులో ఒక చిన్నారి తన తండ్రి ఒడిలో కూర్చుని కారు స్టీరింగ్‌ను తిప్పుతూ కనిపిస్తాడు. కారు బ్రేక్, క్లచ్, యాక్సిలరేటర్ కంట్రోల్స్ తండ్రి దగ్గర ఉన్నప్పటికీ.. స్టీరింగ్ తిప్పడం, గేర్లు మార్చడం వంటివి మాత్రం ఆ బుడతడే చేస్తున్నాడు. ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ లాగా కారును బేస్‌మెంట్‌లో చాలా దూరం నడిపి, సరైన యాంగిల్‌లో తీసుకెళ్లి పార్క్ చేశాడు.


వీడియో తీస్తున్న తండ్రి.. "నీకు తెలుసు కదా ఎక్కడ పార్క్ చేయాలో?" అని అడగ్గా, ఆ పిల్లాడు ఎంతో కాన్ఫిడెన్స్‌తో "తెలుసు డాడీ" అని సమాధానం ఇచ్చాడు. మరోవైపు ఆ పిల్లాడి తల్లి వెనుక నుంచి.. "జాగ్రత్త నాన్న.. నా మెర్సిడెస్ కారు కూడా అక్కడే ఉంది" అని చెబుతోంది. ఆ బాలుడు ఎక్కడా తడబడకుండా కారును పర్ఫెక్ట్‌గా పార్క్ చేయడం చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు నెటిజన్లు "ఈ పిల్లాడు గిఫ్టెడ్ చైల్డ్.. ఇంత చిన్న వయసులో అంత కంట్రోల్ ఉండటం గ్రేట్" అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, మెజారిటీ నెటిజన్లు మాత్రం తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "డ్రైవింగ్ అనేది చిన్న పిల్లల ఆట కాదు. స్టీరింగ్ తిప్పడం నేర్పించడం వల్ల రేపు పిల్లాడు మీరు లేనప్పుడు కారు స్టార్ట్ చేసే ప్రమాదం ఉంది. ఇది చట్టవిరుద్ధం మరియు భద్రతకు ముప్పు" అని హెచ్చరిస్తున్నారు.

తల్లిదండ్రుల ఉత్సాహం పిల్లాడి ప్రాణాల మీదకు తీసుకురాకూడదని, ఇలాంటి పనులను ప్రోత్సహించడం సరైన పద్ధతి కాదని ట్రాఫిక్ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. టాలెంట్ ఉండటం వేరు, దాన్ని ప్రమాదకరమైన రీతిలో ప్రదర్శించడం వేరని నెటిజన్లు హితువు పలుకుతున్నారు.

Tags:    

Similar News