Viral: అమ్మ బాబోయ్… కరెన్సీ కౌంటింగ్ కొత్త మోసం – ఇలా మీరు మోసపోవద్దు
రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మార్కెట్లు, ఫైనాన్స్ ఆఫీసులు… ఎక్కడ చూసినా డబ్బు కౌంటింగ్ సీన్లు కంటపడతాయి. కానీ ఈ సీన్ల వెనక దాగి ఉన్న కొత్త మోసంపై వింటే నిజంగా “అమ్మ బాబోయ్!” అనాల్సిందే.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ స్కామ్ కరెన్సీ కౌంటింగ్‌తో సంబంధం కలిగినది. 500 రూపాయల నోట్ల కట్టను చక్కగా కట్టినట్టే కనిపిస్తుంది. కానీ అందులోని కొన్ని నోట్లను మడిచిపెట్టి లోపల ఖాళీ గ్యాప్ ఉంచేస్తారు. కౌంటింగ్ మెషీన్‌లో వేసినా, చేత్తో లెక్కించినా — గమనించని వారికి మాత్రం మొత్తం నోట్లు ఉన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ వాస్తవానికి లోపల కొన్నింటిని తగ్గించి మోసం చేస్తున్నారు. ఇలా సైలెంట్‌గా లక్షల్లో, వేలల్లో డబ్బు మాయం అవుతోంది.
ఈ కొత్త “కౌంటింగ్ కట్టర్” టెక్నిక్‌కు ఇప్పటికే చాలామంది బలయ్యారు. పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ, పెద్ద మొత్తంలో కరెన్సీ ఇచ్చే-తీసుకునే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తగా లెక్కించుకోవాలని సూచిస్తున్నారు.