Viral: ముసుగులో వచ్చి కాలేజీలో రూ.8 లక్షల చోరీ – దొంగ ఎవరో తెలిసి అందరూ షాక్!
ఓ విద్యా సంస్థలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. కాలేజీ ఆఫీస్‌లోంచి రూ.8 లక్షలు గల్లంతవ్వడంతో యాజమాన్యం, స్టాఫ్ షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సీసీ ఫుటేజ్‌తో బహిర్గతమైన సత్యం
అహ్మదాబాద్‌లోని మెఘాణీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయిన తర్వాత కాలేజ్‌లోని సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు. ఒక ఫుటేజ్‌లో ముసుగుతో వచ్చిన దొంగ కదలికలు, స్టైల్, కళ్లద్దాల ఫ్రేమ్ చూసిన తర్వాత ఇది లోపలి వ్యక్తి పనే అని పోలీసులు గుర్తించారు.
దొంగతనానికి పాల్పడ్డది ఎవరంటే…?
దొంగ మరెవరో కాదు… కాలేజీకి మార్గదర్శకురాలిగా ఉండాల్సిన లేడీ వైస్ ప్రిన్సిపాల్ గారే! ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన ఆమె ఆరు నెలలుగా లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఆ నష్టాన్ని తీర్చుకోవడానికే తాను పనిచేస్తున్న కాలేజీ నుంచి డబ్బు దొంగిలించారు.
జీవితాన్ని మార్చేసిన తప్పు
తప్పు ఒప్పుకున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఓ క్షణిక మోహం, ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం ఆమె జీవితాన్నే జైలుకి నెట్టేసింది.