Viral News: మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్న బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్ – హాట్‌కేక్‌లా అమ్ముడవుతున్న కారణం ఇదే!

ఐస్‌క్రీమ్ అంటే చిన్నా పెద్దా అందరూ ఇష్టపడే మిఠాయి. కానీ ఇప్పుడు "బ్రెస్ట్ మిల్క్ ఐస్‌క్రీమ్" అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో తల్లి పాలతో ఐస్‌క్రీమ్ తయారు చేశారనే సమాచారం చక్కర్లు కొడుతోంది.

Update: 2025-08-12 11:47 GMT

బ్రూక్లిన్‌లోని డంబో ప్రాంతంలో ఉన్న ఆడ్‌ఫెలోస్ అనే ఐస్‌క్రీమ్ కంపెనీ ఈ ప్రత్యేక ఐస్‌క్రీమ్‌ను విడుదల చేసింది. దీని కోసం ప్రజలు క్యూల్లో నిలబడుతున్నారు. అయితే నిజం ఏమిటంటే — ఈ ఐస్‌క్రీమ్‌లో అసలు తల్లి పాలు ఉపయోగించలేదు. తల్లిపాలకు బదులుగా లిపోసోమల్ బోవిన్ కొలొస్ట్రమ్ అనే పదార్థాన్ని ఉపయోగించారు. ఇది తల్లి పాలలో ఉండే ముఖ్య పోషకాలతో సమానమని చెబుతున్నారు.

ఈ రుచిని ఫ్రిడా అనే పేరెంటింగ్ ఉత్పత్తుల కంపెనీ సహకారంతో తయారు చేశారు. ప్రతిరోజూ కేవలం 50 ఉచిత స్కూప్‌లను మాత్రమే ఇస్తున్నారు కాబట్టి ఇది మరింత క్రేజ్‌ అవుతోంది.

కాలిఫోర్నియాలోని మమ్మత్ లేక్స్‌కి చెందిన చార్లీన్ రిమ్‌షా, రాక్‌అవే బీచ్‌లోని ఈ షాప్‌కి వెళ్లి ఈ ఐస్‌క్రీమ్ రుచి చూశారు. ఆమెకు చిన్ననాటి అమ్మ జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వచ్చాయని, అది తనకు భావోద్వేగపూరితమైన అనుభూతిని కలిగించిందని చెప్పారు.

61 ఏళ్ల డేల్ కప్లాన్ మాత్రం దీన్ని తిన్నప్పటికీ ప్రత్యేకమైన ఫీలింగ్ రాలేదని అన్నారు. మరొకరు దీన్ని “వనిల్లా లాంటి రుచి” అని వర్ణించారు. మరో మహిళ తన నాలుగు నెలల బిడ్డతో కలిసి తిన్నప్పుడు, ఇది మామిడి రుచితో ఉందని తెలిపింది.

Tags:    

Similar News