Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సాహసం.. చూస్తేనే భయం వేయం ఖాయం

Viral Video: ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు ఎద్దు ముందు తలకిందులుగా నిల్చున్నాడు. ఎద్దు ఒక్కసారిగా తన కొమ్ములతో ఆ యువకుడిని పైకెత్తి, కిందపడేసింది.

Update: 2025-04-30 07:38 GMT

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సాహసం.. చూస్తేనే భయం వేయం ఖాయం

Viral Video: సోషల్ మీడియాలో స్టంట్లతో కూడిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చూస్తే గుండె జల్లుమనడం ఖాయం. తాజాగా అలాంటి ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది. ఇందులో ఓ యువకుడు ఎద్దుతో స్టంట్ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు ఎద్దు ముందు తలకిందులుగా నిల్చున్నాడు. ఎద్దు ఒక్కసారిగా తన కొమ్ములతో ఆ యువకుడిని పైకెత్తి, కిందపడేసింది. అటూ ఇటూ తోసుకుంటూ తీసుకెళ్లింది. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే లక్కీగా అక్కడే ఉన్న ఓ స్టాండ్ చేతికి తగలడంతో పట్టుకొని బచాయించాడు.

దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను సుమారు 3 లక్షలకుపైగా మంది లైక్ చేశారు. వీడియో చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు.

జీవితంలో మరోసారి ఇలాంటి స్టంట్ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు స్పందిస్తూ.. చూడ్డానికి భయంగా ఉంది స్టంట్ ఎలా చేశావు సామీ అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.



Tags:    

Similar News