Video: అదృష్టం అలా కలిసివచ్చింది… లేకపోతే ఏనుగు కాలికింద నలిగిపోయేవాడు!
కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్‌లో ఒక భయానక ఘటన చోటుచేసుకుంది. కేరళకు చెందిన ఓ పర్యాటకుడు ఏనుగు దాడి నుండి అద్భుతంగా బయటపడ్డాడు.
Video: అదృష్టం అలా కలిసివచ్చింది… లేకపోతే ఏనుగు కాలికింద నలిగిపోయేవాడు!
కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్‌లో ఒక భయానక ఘటన చోటుచేసుకుంది. కేరళకు చెందిన ఓ పర్యాటకుడు ఏనుగు దాడి నుండి అద్భుతంగా బయటపడ్డాడు. వీడియోలో బందీపూర్ జాతీయ ఉద్యానవనం లోపల వాహనాలు, ప్రజలతో కిక్కిరిసిన రోడ్డుపై ఒక అడవి ఏనుగు నిలబడి ఉంటుంది. కొద్ది సేపటికే రోడ్డుపక్కన నడుస్తున్న ఆ పర్యాటకుడిపై ఏనుగు అకస్మాత్తుగా దాడి చేసింది.
ఏనుగును గమనించిన వెంటనే అతను భయంతో పరుగెత్తినా, కొద్దిదూరంలో జారి పడిపోయాడు. ఆ క్షణంలో ఏనుగు అతన్ని తొక్కే ప్రయత్నం చేసింది. అయితే అదృష్టవశాత్తూ ఏనుగు వెనక్కి తగ్గింది. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. గాయాలతో ఉన్న అతన్ని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై అటవీ అధికారులు స్పందిస్తూ, బాధితుడి వివరాలను గుర్తించే ప్రయత్నం కొనసాగుతున్నట్లు తెలిపారు. అలాగే పర్యాటకులు వన్యప్రాణుల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. బందీపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటక, తమిళనాడు, కేరళలను కలిపే ప్రధాన వన్యప్రాణి కారిడార్‌లో భాగమని వారు గుర్తు చేశారు.