Viral Video: రాత్రి పూట బైక్‌ వెళ్తుండగా పైకి దూసుకొచ్చిన భారీ ఆకారం..! గుండె ఆగినంత పనైంది

తిరుపతి పార్క్‌ రోడ్‌లోని అలిపిరి జూ సమీపంలో సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో bike పై వెళ్తున్న ఓ వ్యక్తిపై చిరుతపులి దాడికి పాల్పడింది.

Update: 2025-07-28 16:29 GMT

Viral Video: రాత్రి పూట బైక్‌ వెళ్తుండగా పైకి దూసుకొచ్చిన భారీ ఆకారం..! గుండె ఆగినంత పనైంది

తిరుపతి పార్క్‌ రోడ్‌లోని అలిపిరి జూ సమీపంలో సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో bike పై వెళ్తున్న ఓ వ్యక్తిపై చిరుతపులి దాడికి పాల్పడింది. ఈ భయానక ఘటన వెనుక నుంచి వస్తున్న కారులోని వ్యక్తి తీసిన వీడియోలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ వీడియోను @jsuryareddy అనే ట్విట్టర్ ఖాతా షేర్ చేసింది. అందులో ఓ చిరుతపులి రాత్రి చీకట్లోనుంచి చంపాడిలా బయిక్కు పైకి దూకుతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అదృష్టవశాత్తు బైక్‌పై ఉన్న వ్యక్తి గాయపడకుండా తప్పించుకున్నాడు. దాడి అనంతరం చిరుత భయంతో వెనక్కి పరుగులు తీసింది.

ఈ ఘటన స్థానికులను, నెటిజన్లను ఉలిక్కిపడేలా చేసింది. అడవి జీవులు మానవ నివాస ప్రాంతాలకు సమీపంలోకి రావడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను మరోసారి ఈ ఘటన గుర్తు చేసింది.




Tags:    

Similar News