Snake Bite: యువకుడ్ని కాటేసిన పాము, యువకుడు సేఫ్..కానీ పాము మృతి

Snake Bite: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో, ఖుద్సోడి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. సచిన్ అనే ఒక యువకుడు కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతన పని ముగించుకుని తిరిగి వస్తున్న రాత్రి సమయంలో అనుకోకుండా ఒక పామును తొక్కాడు.

Update: 2025-06-20 13:24 GMT

Snake Bite: యువకుడ్ని కాటేసిన పాము, యువకుడు సేఫ్..కానీ పాము మృతి

Snake Bite: కలియుగంలో అన్ని విచిత్రాలే జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పినట్లు రోజుకో వింత జరుగుతుంది. తాజాగా రాత్రి సమయంలో వెళ్తున్న ఒక యువకుడ్ని ఒక విషపూరితమైన పాము కాటేసింది. కాటేసిన 10నిలకే ఆ పాము గిలగిల కొట్టుకుని చనిపోయింది. ఆ యువకుడ్ని హాస్పిటల్‌కి తీసుకెళ్తే అతను బతికాడు. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో, ఖుద్సోడి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. సచిన్ అనే ఒక యువకుడు కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతన పని ముగించుకుని తిరిగి వస్తున్న రాత్రి సమయంలో అనుకోకుండా ఒక పామును తొక్కాడు. అయితే అది అతని కాలుని కరిచింది. భయంతో వణికి పోయిన ఆ యువకుడ్ని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లి, చికిత్స చేయించారు. అయితే యువకుడ్ని కరిచిన పాము ఒక పది నిమిషాల తర్వాత గిలగిల కొట్టుకుంటూ చచ్చిపోయింది. దీంతో ఊరిజనం అంతా ఈ వింత ఎందుకు జరిగిందా? అని భయంతో వణికి పోయారు.

అయితే ఎప్పుడో ఒకసారి ఇలా జరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాము మనిషిని కాటేసిన, వెంటనే అది చనిపోవడం అనేది మామూలు విషయం కాదు. దాని శరీరంలో ఏదో మార్పులు రావడమే దాని మరణానికి కారణమని అటవీశాఖ నిపుణులు అన్నారు. ఒక వేళ పాము కాటేటప్పుడు తన శరీరాన్ని బలంగా మెలితిప్పితుంది. ఈ సమయంలో దానిలోపల ఉన్న విషపు సంచి పగిలి ఉండవచ్చు. అందుకే ఆ విషం దాని శరీరంలోకి వెళ్లి ఉంటే అది చనిపోతుంది. ఈ పాము విషయంలో కూడా అదే జరిగి ఉంటుందని అన్నారు. అంతేకాదు ఈ పాముపై పరిశోధనలు చేసేందుకు దాన్ని ల్యాబ్‌కి కూడా తరలించారు.

Tags:    

Similar News