అమ్మ బాబోయ్..! కొలనులో 13 అడుగుల కొండచిలువ – బంధిస్తుండగా అది కక్కింది చూసి అందరూ స్టన్
వనపర్తి జిల్లాలో ఆదివారం ఉదయం ఓ 13 అడుగుల పొడవున్న కొండచిలువ పట్టుబడింది. గోపాలపేట మండల కేంద్రంలోని అవుసులకుంట చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. చెరువు దగ్గర కొండచిలువ సంచరిస్తున్నట్లు గుర్తించిన గ్రామస్తులు వెంటనే స్నేక్ సొసైటీ అధ్యక్షుడు చీర్ల కృష్ణ సాగర్కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే సాగర్ సారధ్యంలోని బృందం అక్కడికి చేరుకుని, కొండచిలువను విజయవంతంగా పట్టుకున్నారు. ఈ ప్రక్రియలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అప్పటికే ఒక 5 అడుగుల పొడవున్న ఉడుమును మింగిన కొండచిలువ, పట్టుబడుతుండగా దాన్ని బయటికి కక్కేసింది.
ఈ సందర్భంగా కృష్ణ సాగర్ మాట్లాడుతూ, చెరువు ఊరికి దగ్గరగా ఉండటంతో గ్రామస్తులు, ముఖ్యంగా చిన్నపిల్లలు చెరువువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. అలాగే విషసర్పాలు, అడవి జంతువుల నుంచి అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులకు సూచించారు.