Viral: భర్త వేధింపులు భరించలేని ఇద్దరు మహిళలు.. సంచలన నిర్ణయం..!

Viral: మనిషి సాంకేతికంగా ఇంత ఎత్తుకు ఎదిగినా ఇప్పటికీ కొందరి ప్రవర్తనలలో మార్పు రావడం లేదు.

Update: 2025-01-25 06:24 GMT

Viral: భర్త వేధింపులు భరించలేని ఇద్దరు మహిళలు.. సంచలన నిర్ణయం..!

Viral: మనిషి సాంకేతికంగా ఇంత ఎత్తుకు ఎదిగినా ఇప్పటికీ కొందరి ప్రవర్తనలలో మార్పు రావడం లేదు. దేశంలో గృహ హింస ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మద్యం సేవించే భర్తల చేతుల్లో దెబ్బలు తింటోన్న మహిళలు ఎందరో. ఇలాంటి వేధింపులు భరించిన ఇద్దరు మహిళలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఇద్దరు మహిళలు తమ ఇళ్లను విడిచిపెట్టి ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. భర్తలు పెడుతోన్న ఇబ్బందులు భరించలేని వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం సాయంత్రం డియోరియాలోని చోటి కాశీగా ప్రసిద్ధి చెందిన శివాలయంలో కవిత, గుంజా అలియాస్ బబ్లూ వివాహం చేసుకున్నారు. దీంతో ఈ అంశం కాస్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే వీరిద్దరు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పరిచమయ్యారు. తర్వాత స్నేహితులుగామారిన వీరు ఆరేళ్ల పాటు టచ్‌లో ఉన్నారు. ఇద్దరూ మహిళలు తమ భర్తల చేతిలో గృహ హింసకు గురికావడంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. భర్తలను వదిలి వచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకు అనుగుణంగా ఏకంగా దేవుడి సాక్షిగా ఒక్కటయ్యారు. ఆలయంలో గుంజ వరుడిగా మారి కవిత నుదుటిపై బొట్టు పెట్టింది. అంతేకాదు దండలు కూడా మార్చుకున్నారు.

మద్యానికి బానిసైన తన భర్త తనపై రోజూ దాడి చేసేవాడని వీరిలో ఓ మహిళ తెలిపింది. ఆమెకు నలుగురు పిల్లలు ఉండడం గమనార్హం. పదేపదే హింసను భరించిన తర్వాత ఆమె తల్లిదండ్రుల ఇంటికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది. తన భర్త కూడా అతిగా మద్యం సేవించి వచ్చి భౌతికంగా దాడి చేసే వాడని మరో మహిళ పేర్కొంది. వీరిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. 'మా భర్తల దాష్టికానికి మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ప్రశాంతత, ప్రేమతో కూడిన జీవితాన్ని ఎంచుకోవడానికి ఇదే దారి తీసింది. మేము గోరఖ్‌పూర్‌లో జంటగా జీవించాలని నిర్ణయించుకున్నాం' అని చెప్పుకొచ్చారు. ఇక తాము జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామని, తమను ఎవరూ విడదీయలేరని మహిళలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వారికి శాశ్వత ఇల్లు లేకపోయినా, అద్దెకు నివాసం ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.

Tags:    

Similar News