Viral Video: బయట బాత్‌రూమ్‌లు ఉపయోగించే మహిళలు జాగ్రత్తగా ఉండాల్సిందే.. షాకింగ్ వీడియో

Viral Video
x

Viral Video: బయట బాత్‌రూమ్‌లు ఉపయోగించే మహిళలు జాగ్రత్తగా ఉండాల్సిందే.. షాకింగ్ వీడియో

Highlights

Viral Video: 'గోడలకు చెవులు ఉంటాయి' ఈ సామెత గురించి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతోన్న సంఘటనలు చూస్తుంటే గోడలకు చెవులు మాత్రమే కాదు కళ్లు కూడా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Viral Video: 'గోడలకు చెవులు ఉంటాయి' ఈ సామెత గురించి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతోన్న సంఘటనలు చూస్తుంటే గోడలకు చెవులు మాత్రమే కాదు కళ్లు కూడా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొందరు కేటుగాళ్లు బాత్‌రూమ్స్‌లో, ట్రయల్‌ రూమ్స్‌లో సీక్రెట్‌ కెమెరాలను పెడుతూ రహస్యంగా చిత్రీకరిస్తున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే బయటి బాత్‌రూమ్స్‌ను, రెస్ట్‌ రూమ్స్‌ను ఉపయోగించే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తాజాగా వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. వివరాల్లోకి వెళ్తే.. ఒక మహిళ బాత్‌రూమ్‌లోకి వెళ్లిన సమయంలో తను ఏమీ అనుమానించలేదు. అద్దంలోనూ, చుట్టుపక్కల ఎక్కడా కెమెరా కనిపించలేదు. కానీ నేలపై ఫ్లోరింగ్‌ టైల్స్ మధ్యలో చిన్న ఎర్రటి లైట్ మెరుస్తోంది. దాన్ని పరిశీలించగా అక్కడ రహస్య కెమెరా పెట్టినట్టు బయటపడింది. ఎవరికీ అనుమానం రాకుండా రెండు టైల్స్‌ మధ్య ఉన్న గ్యాప్‌లో ఈ సీక్రెట్‌ కెమెరాను ఏర్పాటు చేశారు.

దీనిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు భయాందోళనకు గురవుతున్నారు. మహిళల భద్రతా ఇంతలా ప్రశ్నార్థకంగా మారితే పరిస్థితి ఎలా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. బాత్‌రూమ్, హోటల్ రూమ్‌లోకి వెళ్లేముందు చుట్టూ ఎలాంటి చిన్న లైట్లు లేదా చిన్న రంధ్రాలుంటే గమనించాలి. అలాగే మొబైల్‌ ఫోన్‌లో ఫ్లాష్‌ ఆన్‌ చేసి ఫ్లోర్‌తో పాటు గోడలపై ఏమైనా అనుమానాదస్పద వస్తువులు ఉన్నాయో చూసుకోవాలి. ఇక సీక్రెట్‌ కెమెరాలను గుర్తించే గ్యాడ్జెట్స్‌ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం మరీ మంచిది.



Show Full Article
Print Article
Next Story
More Stories