ప్రపంచంలో వేగంగా ఎగిరే పక్షి ఏంటో మీకు తెలుసా..? దాని వేట ఒక అద్భుతం..

Peregrine Falcon: ఈ భూమిపై మానవుడితో పాటు ఎన్నో జీవజాతులు ఉన్నాయి. ఇందులో వేటికవే ప్రత్యేకం.

Update: 2021-12-30 09:22 GMT

ప్రపంచంలో వేగంగా ఎగిరే పక్షి ఏంటో మీకు తెలుసా..? దాని వేట ఒక అద్భుతం..

Peregrine Falcon: ఈ భూమిపై మానవుడితో పాటు ఎన్నో జీవజాతులు ఉన్నాయి. ఇందులో వేటికవే ప్రత్యేకం. కానీ పెరుగుతున్న కాలుష్యం, వాతావరణం దృష్ట్యా కొన్ని జాతులు అంతరిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎగిరే పెరెగ్రైన్ ఫాల్కన్ అనే పక్షి జాతి కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉంది. ఈ పక్షి చాలా ప్రత్యేకమైంది.

ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చిరుత అయితే అత్యంత వేగంగా ఎగిరే పక్షి పెరెగ్రైన్ ఫాల్కన్. దీనిని డక్ హాక్ అని కూడా పిలుస్తారు. ఈ పక్షి విశేషాలేంటో ఈ రోజు తెలుసుకుందాం. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం.. పెరెగ్రైన్ ఫాల్కన్ గరిష్టంగా గంటకు 389 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది. ఈ వేగాన్ని ఉపయోగించి ఈ పక్షి సెకన్లలో వేట ముగిస్తుంది.

ఇది ఇంత వేగంతో ఎలా ఎగురుతుంది అనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. దాని రెక్కలు, ఎముకల నిర్మాణమే ఇందుకు కారణమని చెబుతున్నారు. దాని శరీరంలో ఉండే కీల్ ఎముక పెద్దదిగా ఉండటంతో పాటు దాని పొడవైన రెక్కలను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. పెరెగ్రైన్ ఫాల్కన్ శరీర రంగు బూడిద రంగులో ఉంటుంది. పొడవు 36 నుంచి 49 సెం.మీ. వేగంగా ఎగురుతున్న దాని ప్రత్యేకత వేటలో సహాయపడుతుంది.

ఈ పక్షి అతి పెద్ద లక్షణం ఏంటంటే ఎగురుతూ జీవించే పక్షులను పట్టుకుని తింటుంది. సాధారణంగా ఇది చిన్న బాతులు, పాటల పక్షులు, తీరప్రాంత పక్షులను వేటాడుతుంది. ఈ పక్షి ధ్రువ ప్రాంతం మినహా దాదాపు అన్ని దేశాలలో కనిపిస్తుంది. ఆడ పక్షుల శరీరం మగవాటి కంటే పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఒక నివేదిక ప్రకారం.. పుట్టిన ఒక సంవత్సరంలో ఈ పక్షి సంభోగానికి సిద్ధంగా ఉంటుంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా ప్రాంతాల్లో వీటి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. చాలా దేశాల్లో వీటి సంఖ్య బాగా తగ్గిపోయి అరుదైన పక్షుల కేటగిరీలో చేరందని పరిశోధన నివేదిక చెబుతోంది. వాటి క్షీణతకు ప్రధాన కారణం పురుగుమందుల వాడకం, ముఖ్యంగా డిడిటి. పక్షి సంరక్షణ కార్యక్రమం ప్రవేశపెట్టిన తర్వాత వీటి సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఊహించిన దానికంటే తక్కువగానే ఉంది.

Tags:    

Similar News