Viral Video: అగ్ని సాక్షిగా కాదు.. గ్యాస్ స్టవ్ సాక్షిగా! బీహార్‌లో ఇద్దరమ్మాయిల వింత పెళ్లి.. షాక్‌లో నెటిజన్లు
Viral Video: సమాజంలో పెళ్లి అనే వ్యవస్థపై నమ్మకాలు, పద్ధతులు వేగంగా మారిపోతున్నాయి.
Viral Video: అగ్ని సాక్షిగా కాదు.. గ్యాస్ స్టవ్ సాక్షిగా! బీహార్‌లో ఇద్దరమ్మాయిల వింత పెళ్లి.. షాక్‌లో నెటిజన్లు
Viral Video: సమాజంలో పెళ్లి అనే వ్యవస్థపై నమ్మకాలు, పద్ధతులు వేగంగా మారిపోతున్నాయి. ఒకవైపు పెళ్లిళ్లు కుదరక యువత సతమతమవుతుంటే, మరోవైపు వింత పోకడలతో కొంతమంది వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బీహార్‌లోని సుపౌల్ జిల్లాలో జరిగిన ఒక వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు యువతులు ప్రేమలో పడి, రహస్యంగా పెళ్లి చేసుకోవడమే కాకుండా.. వారు పాటించిన పద్ధతి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
సోషల్ మీడియా పరిచయం.. ప్రేమగా మార్పు
మధేపురాకు చెందిన పూజా గుప్తా, శంకర్ పూర్ ప్రాంతానికి చెందిన కాజల్ కుమారీ అనే ఇద్దరు యువతులకు సోషల్ మీడియా వేదికగా పరిచయం ఏర్పడింది. త్రివేణిగంజ్‌లోని ఒక షాపింగ్ మాల్‌లో వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఆ పరిచయం కాస్తా గాఢమైన ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని భావించిన వీరు, పెళ్లి బంధంతో ఒకటి కావాలని నిర్ణయించుకున్నారు.
గ్యాస్ స్టవ్ చుట్టూ ఏడడుగులు!
వీరి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించి, వారిని మందలించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని పూజా, కాజల్.. త్రివేణిగంజ్‌లోని మేళా గ్రౌండ్ సమీపంలో ఉన్న ఒక గదిలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. సాధారణంగా హిందూ సంప్రదాయంలో అగ్నిహోత్రం (హోమం) చుట్టూ ఏడడుగులు నడుస్తారు. కానీ, వీరిద్దరూ వెరైటీగా గ్యాస్ స్టవ్ వెలిగించి దాని చుట్టూ ఏడడుగులు నడిచి ఒక్కటయ్యారు. ఈ వింత పెళ్లిని వీడియో కూడా తీసుకున్నారు.
కుటుంబ సభ్యుల దాడి.. పోలీస్ కౌన్సెలింగ్
పెళ్లి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని యువతులపై దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో విషయం పోలీసుల వరకు వెళ్ళింది. ప్రస్తుతం పోలీసులు ఆ ఇద్దరు యువతులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వారి భవిష్యత్తు మరియు చట్టపరమైన అంశాలపై వివరిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఇంకెన్ని వింతలు చూడాలి బాబోయ్!" అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు జన్యుపరమైన మార్పులు మరియు సామాజిక పోకడలపై చర్చ మొదలుపెట్టారు.