Snake safety tips: పాములకు ఈ పద్దార్దాలంటే విపరీతమైన భయం.. ఇంట్లో ఈ పద్ధతులు పాటిస్తే సర్పాలకు హడలే..!

Snake safety tips: వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముల బెడద ఎక్కువయ్యే ప్రమాదం కనిపిస్తుంది. చాలామంది ఈ సీజన్‌లో ఇంట్లోకి పాములు చొరబడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.

Update: 2025-07-28 02:18 GMT

Snake safety tips: పాములకు ఈ పద్దార్దాలంటే విపరీతమైన భయం.. ఇంట్లో ఈ పద్ధతులు పాటిస్తే సర్పాలకు హడలే..!

Snake safety tips: వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముల బెడద ఎక్కువయ్యే ప్రమాదం కనిపిస్తుంది. చాలామంది ఈ సీజన్‌లో ఇంట్లోకి పాములు చొరబడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే, సులభంగా ఇంట్లో ఉంచగలిగే కొన్ని పదార్థాలతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పాముల భయంతో నిత్యం ఉక్కిరిబిక్కిరయ్యే ప్రజల కోసం పౌరాణిక విశ్వాసాలతో పాటు ప్రకృతి ఆధారిత చిట్కాలు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. హిందూ సనాతన సంప్రదాయంలో పాములు — వాసుకీ, ఆదిశేషువు వంటి దేవతా స్వరూపాలుగా पूజింపబడతున్నా, వాస్తవ జీవితంలో మాత్రం పాములు ప్రమాదకరమైన జీవులుగా భయాన్ని కలిగిస్తుంటాయి.

వర్షాకాలం, ఎండాకాలంలో పాముల ప్రవేశం ఎక్కువ

పాములు ఎక్కువగా వర్షాకాలంలో బహిరంగ ప్రదేశాల్లో నుండి నీడ కోసం ఇళ్లలోకి వస్తుంటాయి. ఎండాకాలంలోనూ వేడి తట్టుకోలేక నీడ కోసం ఇంటి లోపలికి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రాత్రివేళల్లో పాములు ఇంట్లోకి చొరబడి కాటేయడం వంటి ప్రమాదకర సంఘటనలు కూడా నమోదవుతున్నాయి.

కర్పూరం వాసనతో భయపడే పాములు

సర్పాలను తట్టుకోలేని ఒక శక్తివంతమైన పదార్థం కర్పూరం. దీనివాసన పాములకు అసహ్యంగా ఉంటుంది. ముక్కు సున్నితంగా ఉండే పాములు కర్పూర వాసన వచ్చిన చోట ఒక్క క్షణం కూడా ఉండలేవని బయోలాజీ నిపుణులు చెబుతున్నారు.

ఇంటికి గుమ్మం వద్ద కర్పూరం గుత్తులు ఉంచడం, లేదా పరిసరాల్లో కర్పూరం పొడి చల్లడం వలన పాముల దూరంగా ఉండే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో ఈ చిట్కా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

ప్రాణనష్టం నివారించాలి

పాము కాటుకు సమయానికి చికిత్స పొందితే ప్రమాదం ఉండదు. అయితే ఆలస్యం చేస్తే ప్రాణనష్టం సంభవించవచ్చు. అందుకే ముందుజాగ్రత్తలు తీసుకొని పాములను ఇంటికి దరిదాపుల్లోకి రానివ్వకుండా చూసుకోవాలి.

సూచన: ఈ నివేదికలో పేర్కొన్న సూచనలు సర్వసాధారణ జాగ్రత్తల కోణంలో చెప్పబడినవి. తీవ్రమైన సర్పభయం లేదా పాము కాటు ఘటనల సందర్భంలో నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

Tags:    

Similar News