Shubhanshu Shukla Video: అంతరిక్షం నుంచి వచ్చాక నడవడం ఇంత కష్టమా? శుభాన్షు శుక్లా వైరల్ వీడియో..!
Shubhanshu Shukla Video: గత వారం విజయవంతంగా అంతరిక్షం నుంచి వచ్చిన ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా మళ్లీ భూమిపై నడవడం నేర్చుకుంటున్నారు.
Shubhanshu Shukla Video: అంతరిక్షం నుంచి వచ్చాక నడవడం ఇంత కష్టమా? శుభాన్షు శుక్లా వైరల్ వీడియో..!
Shubhanshu Shukla Video: గత వారం విజయవంతంగా అంతరిక్షం నుంచి వచ్చిన ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా మళ్లీ భూమిపై నడవడం నేర్చుకుంటున్నారు. ఆక్సియం–4 మిషన్‌లో భాగంగా జూన్ 25న వెళ్లిన శుభాన్షు శుక్లా దాదాపు 18రోజుల పాటు అంతరిక్షంలో గడిపి జులై 15న తిరిగి వచ్చారు. అయితే ఆ తర్వాత శుక్లా తాను మళ్లీ నడవడానికి ప్రయత్నిస్తున్నట్టు.. భూమి గురుత్వాకర్షణకు అలవాటు పడుతున్నట్టు చెబుతో సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు.
స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ప్రయాణించిన నలుగురు సిబ్బందిలో శుభాన్షు శుక్లా ఒకరు. ఆయన మిగిలిన ముగ్గురికి హెడ్‌గా వ్యవహరించారు. దాదాపు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లో 18 రోజుల పాటు గడిపారు. ఆ తర్వాత విజయవంతంగా భూమికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఆయన నెమ్మది నెమ్మదిగా నడుస్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతరిక్షానికి వెళ్లి వచ్చిన వారు నడవడానికి ఇంత కష్టమా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
శుభాన్షు శుక్లా అడుగులు వేస్తుంటే ఇద్దరు వ్యక్తులు ఆయనకు సపోర్టుగా నిలుస్తారు. ఈ వీడియోని తన ఇన్ స్టాలో శుక్లా పోస్ట్ చేశారు. భూమి గురుత్వాకర్షణకు అలవాటు పడుతున్నట్టు కూడా ఆయన తన మెసేజ్‌లో చెప్పారు. ‘నేను భూమికి చేరుకోగానే ఎంతోమంది నాకు మెసేజ్‌లు పంపారని, అందులో అన్నీ కూడా నా ఆరోగ్యం గురించే ఉన్నాయని.. నేను నిజంగా చాలా అదృష్టవంతుడిని’ అంటూ శుక్లా పేర్కొన్నారు. ‘భూమి వాతావరణం, స్పేస్ వాతావరణం చాలా భిన్నం. అందుకే ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లినప్పుడు మన శరీరం అలవాటు పడడానికి చాలా సమయం పడుతుంది. అదేవిధంగా అక్కడ నుంచి ఇక్కడకు వచ్చినప్పుడు కూడా ఈ వాతావరణానికి శరీరం అలవాటు పడాలని’ కూడా శుక్కలా పేర్కొన్నారు.