Viral Video: గుర్రమెక్కి షాపింగ్‌కు వెళ్లాడు.. మాల్‌లో గుర్రం చేసిన పనికి కస్టమర్లు బెంబేలు

Viral Video: షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు రకరకాల వింత మనుషులు కనిపిస్తుంటారు. కానీ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న ఒక టార్గెట్ స్టోర్‌లోకి వెళ్లిన కస్టమర్లకు మాత్రం ఊహించని షాక్ తగిలింది.

Update: 2026-01-09 12:30 GMT

Viral Video: గుర్రమెక్కి షాపింగ్‌కు వెళ్లాడు.. మాల్‌లో గుర్రం చేసిన పనికి కస్టమర్లు బెంబేలు

Viral Video: షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు రకరకాల వింత మనుషులు కనిపిస్తుంటారు. కానీ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న ఒక టార్గెట్ స్టోర్‌లోకి వెళ్లిన కస్టమర్లకు మాత్రం ఊహించని షాక్ తగిలింది. ఒక వ్యక్తి ఏకంగా గుర్రం ఎక్కి షాపింగ్ మాల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. గుర్రాన్ని చూసి జనం భయంతో పరుగులు తీస్తుంటే, ఆ గుర్రం చేసిన పనికి స్టోర్ సిబ్బందికి పిచ్చెక్కిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

అమెరికాలోని డల్లాస్ (టెక్సాస్)లో ఉన్న ఒక భారీ రిటైల్ స్టోర్‌లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. స్టీఫెన్ హార్మన్‌ అనే గుర్రపు శిక్షకుడు, తన గుర్రాన్ని తీసుకుని దర్జాగా స్టోర్ లోపలికి నడుచుకుంటూ వెళ్లాడు. అతనితో పాటు ఒక చిన్న బాబు, ఒక స్నేహితుడు కూడా ఉన్నారు. సాధారణంగా కుక్కలు, పిల్లులను తీసుకురావడమే గగనమైన చోట.. ఏకంగా భారీ గుర్రం స్టోర్ కారిడార్లలో తిరుగుతుండటం చూసి షాపర్లు అవాక్కయ్యారు. కొందరు భయంతో వెనక్కి తగ్గితే, మరికొందరు ఆశ్చర్యంతో తమ ఫోన్లలో ఫోటోలు తీయడం మొదలుపెట్టారు.

ఈ విన్యాసం అంతటితో ఆగలేదు. ఆ గుర్రం స్టోర్ మధ్యలోనే అనేకసార్లు మల విసర్జన చేసింది. మాల్ అంతా ఆ వాసన వ్యాపించడంతో కస్టమర్లు ముక్కు మూసుకున్నారు. వీడియోలో జనం అసహ్యించుకుంటూ అరుస్తున్న శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. గుర్రం చేసిన గందరగోళాన్ని చూసి మాల్ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఉద్యోగి గట్టిగా అరుస్తూ "ఏం చేస్తున్నారు మీరు? గుర్రాన్ని వెంటనే బయటకు తీసుకు వెళ్లండి!" అని హెచ్చరించడం వీడియోలో రికార్డు అయింది.




ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, ఇప్పటివరకు 57 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. స్టీఫెన్ హార్మన్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అతను పెట్‌స్మార్ట్ వంటి ఇతర స్టోర్లలోకి తన గుర్రాన్ని తీసుకువెళ్లి వీడియోలు తీశాడు. కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం, వ్యూస్ సంపాదించడం కోసమే ఇలాంటి పనులు చేస్తున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు. స్టోర్ సెక్యూరిటీ టీమ్ వచ్చి అతన్ని బయటకు పంపేలోపే అతను మాల్ అంతా ఒక రౌండ్ వేసి కస్టమర్లను ఇబ్బంది పెట్టాడు.

ఈ వైరల్ వీడియోపై ఇంటర్నెట్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది కేవలం ఒక ఫన్నీ ప్రాంక్ అని నవ్వుకుంటుండగా, మెజారిటీ ప్రజలు మాత్రం దీన్ని బాధ్యతారాహిత్యమైన చర్యగా కొట్టిపారేస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో జంతువులను తీసుకురావడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలగడమే కాకుండా, ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్రం ఒక్కసారిగా బెదిరి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News