Viral Video: ఈ బాత్రూమ్ సైజ్ ఇంటికి నెలకు రూ. 25 వేల కిరాయి

Update: 2025-02-11 15:51 GMT

ఇండియాలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ఇళ్ల కిరాయిలు ఏ రేంజులో ఉంటాయో అందరికీ తెలిసిందే. చిన్న ఇంటికైనా సరే అద్దె మాత్రం భారీగానే ఉంటుంది. మీరు కూడా ఇప్పటికే అలాంటి ఇళ్లు ఎన్నో చూసి ఉంటారు. కానీ ఇప్పుడు మేం చూపించబోయే రకం మాత్రం ఇప్పటివరకు చూసి ఉండరు. ఈ రూమ్ చిన్నది కానీ అద్దె మాత్రం ఒక ఇంటి లోన్ కోసం చెల్లించే సగటు EMI కంటే ఎక్కువే ఉంది.

ఇదిగో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఉన్న ఇల్లు చూస్తే మీ ఫ్యూజులు ఔట్ అవడం పక్కా!! ఆ రూమ్ పొడవు, వెడల్పు చూస్తే.. బాప్ రే!! రూమ్స్ ఇలా కూడా ఉంటాయా అని ఆశ్చర్యమేస్తుంది.

అన్నట్లు మీకు ఇంకో విషయం చెప్పాలి. సాధారణంగా 1BHK అంటే 1 బెడ్ రూమ్ విత్ హాల్, కిచెన్ అని తెలిసిందే. అలాగే 2BHK కూడా ఏంటో తెలిసిందే. కానీ మీరు ఎప్పుడైనా 1BR అంటే ఏంటో చూశారా? అది ఎలా ఉంటుందో తెలుసా? తెలియకపోతే ఇదిగో ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

వీడియో చూశారు కదా... గదిలో వెడల్పుగా నిలబడి చేతులు రెండు చాచితే అటు ఆ గోడకు, ఇటు ఈ గోడకు చేతులు తాకుతున్నాయి. అంతటితో అయిపోలేదు... గదిలో పొడవు దిశలో తిరిగి ఓ చేత్తో ఒకవైపు గోడను, కాలుతో మరో గోడను తాకి చూపించారు. ఇదంతా ఉన్న చోటు నుండి కదలకుండా గది మధ్యలో నిలబడి చేసి చూపించారు. అది చూడటంతోనే అర్థమైపోతుంది ఆ గది ఎంత పెద్దగా ఉందనేది.

ఇక 1BR సంగతేంటంటారా? యస్ అక్కడికే వస్తున్నాం. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మధ్యలో బాల్కనీలోకి వెళ్లి వచ్చారు కదా... ఆ బాల్కనీతో కలుపుకునే ఈ రూమ్ 1BR అని అంటున్నారు. ఇక్కడ 1BR అంటే బెడ్ రూమ్ కాదు... 1 బాల్కనీ విత్ రూమ్ అని అర్థం. ఎక్కడైనా బాల్కనీని కూడా కలుపుకుని ఇంటికి అద్దె వసూలు చేసే వారిని చూశారా? లేదు కదా... కానీ ఇక్కడ అదే జరుగుతోంది. ఈ ఇంటి కిరాయి రూ. 25,000.

ఈ వీడియోలో కనిపించిన వ్యక్తి ఈ ఇంటి ప్రత్యేకతల గురించి మంచి సెటైర్లు వేశారు. ఈ ఇంట్లో ఉండే వారికి పెద్దగా డబ్బు ఖర్చు కాదని అన్నారు. దానికి ఆయన చెప్పిన లాజిక్ వింటే కచ్చితంగా మీరు నవ్వాపుకోలేరు. డబ్బులు ఎందుకు ఖర్చు కావు అంటే.... ఇంట్లోకి ఫ్రిజ్, టీవీ, వాషింగ్ మెషిన్ లాంటివి ఏవైనా కొనాలి అంటే ముందుగా ఇంట్లో వాటిని పెట్టేంత స్థలం ఉండాలి. కానీ ఈ ఇంట్లో ఆ స్థలమే కరువు కనుక ఏదీ కొనరు.

కచ్చితంగా గళ్ ఫ్రెండ్ కూడా ఉండరు. ఎందుకంటే ఈ ఇంట్లో ఒక్కరు ఉండేందుకు మాత్రమే ప్లేస్ ఉంది. అంతకుమించి స్థలం లేదు. ఒకవేళ గళ్ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఆమె బెడ్‌పై నిద్రపోతే ఆయన నిలబడి ఉండాలి. లేదా ఆయన బెడ్‌పై నిద్రపోతే ఆమె నిలబడాల్సి వస్తుంది. ఈ గొడవంతా ఎందుకు అని గళ్ ఫ్రెండ్‌ని మెయింటెన్ చేసే ఆలోచన కూడా రాదు అనేది ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి చెబుతున్న లాజిక్. ఆయన చెప్పినదాంట్లో లాజిక్ ఎంత ఉన్నదనేది పక్కనపెడితే... కచ్చితంగా ఫన్నీగా మాత్రం ఉంది కదూ!!

మెట్రోసిటీల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఆ చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఉపాధి వేటలో నగరాలకే చేరుతారు. దానికితోడు డిజిటలైజేషన్, గ్లోబలైజేషన్ పుణ్యమా అని దేశ, విదేశాలకు చెందిన వారు కూడా ఉపాధి కోసం ఇలాంటి నగరాలకు వస్తున్నారు. దీంతో మెట్రో నగరాల్లో అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. అందుకు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది బెంగళూరు లైఫ్ అంటే అట్లనే ఉంటది అని కామెంట్ చేస్తే... ఇంకొందరు మా ఇంట్లో బాత్రూమ్ ఇంతకంటే పెద్దగా ఉంటదని కామెంట్స్ పెడుతున్నారు.

Tags:    

Similar News