Post Office: రూ. 550తో రూ. 10 లక్షల కవరేజ్.. బెస్ట్ బీమా పాలసీ
Post Office: ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి వస్తోంది. చిన్న అనారోగ్య సమస్య అయినా లక్షల్లో ఖర్చవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కలిసి వ్యక్తిగత ప్రమాద భీమా పథకాన్ని తీసుకొచ్చాయి.

ఈ పాలసీ ద్వారా తక్కువ ప్రీమియంతో అత్యధిక రక్షణ లభిస్తుంది. ప్రధానంగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకాన్ని 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు తీసుకోవచ్చు.
పాలసీ వివరాలు:
ఇందులో మొత్తం రెండు రకాల బీమాలు ఉన్నాయి.
* మొదటిది రూ. 550 ప్రీమియం చెల్లిస్తే రూ. 10 లక్షల కవరేజ్ లభిస్తుంది.
* రూ. 350 ప్రీమింయ చెల్లిస్తే రూ. 5 లక్షల కవరేజ్ పొందొచ్చు.
ప్రయోజనాలు:
ఆసుపత్రిలో అడ్మిషన్ సమయంలో అయ్యే ఖర్చులకు (ఇన్‌పేషెంట్ ట్రీట్‌మెంట్), శాశ్వత లేదా తాత్కాలిక వికలాంగతకు భీమా, అంబులెన్స్ ఖర్చులు, ప్రసూతి సంబంధిత ఖర్చులు, పిల్లల విద్య సహాయం, ప్రమాద వశాత్తూ మరణం, పర్మనెంట్ డిసేబిలిటీ కలిగినప్పుడు పరిహారం చెల్లిస్తారు.
ఇతర హెల్త్ ప్రొటెక్షన్ ప్రయోజనాలు:
రూ. 10 లక్షల పాలసీ తీసుకుంటే హాస్పిటల్ డైలీ క్యాష్ బెనిఫిట్ రూ. 500, యాక్సిడెంట్ డెత్ క్లెయిమ్ అదనంగా రూ. 1 లక్ష, పిల్లల విద్య సహాయం రూ. 1 లక్ష, ప్రసూతి బెనిఫిట్ – రూ. 2,500, అంత్యక్రియ ఖర్చు – రూ. 5,000 అందిస్తారు.
రూ. 5 లక్షల పాలసీ తీసుకుంటే ప్రమాదంలో మరణం లేదా శాశ్వత వికలాంగత కలిగినప్పుడు రూ. 5 లక్షల పరిహారం అందిస్తారు. వైద్య ఖర్చులకు రూ. 50,000 వరకూ భీమా అందిస్తారు. పిల్లల విద్య కోసం రూ. 25,000 వరకూ ప్రయోజనం పొందొచ్చు. అంత్యక్రియ ఖర్చులకు రూ. 5,000 అందిస్తారు. ఈ బీమాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం స్థానికంగా ఉన్న పోస్టాఫీస్‌ను సందర్శించండి.